Taapsee Pannu: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కథానాయికగా తాప్సీ పన్ను పరిచయమైంది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా ప్లాప్స్ మూటకట్టుకుంది. తెలుగులో ఆఫర్లు రాకుండా పోయాయి. దీంతో బాలీవుడ్ వైపు మొగ్గుచూపింది. అక్కడ పలు వైవిధ్యభరితమైన సినిమాలలో నటించి సక్సెస్‌ఫుల్ నటిగా పేరు సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తాప్సీ, ఇటీవల సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రేమ, పెళ్లి విషయమై రకరకాలుగా వార్తలు వచ్చినా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అది నా పర్సనల్ విషయం, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనేలా కూడా రెండు మూడు సార్లు విషయాన్ని దాటవేసింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో అనే అతన్ని తాప్సీ పెళ్లి చేసుకుంది. 2024 మార్చి 23న ఉదయపూర్‌లో సీక్రెట్‌గా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించి ఒక్క ఫొటో కూడా అధికారికంగా బయటికి రాలేదు. పెళ్లికి ముందు, తర్వాత కూడా ఎక్కడా పెళ్లిపై మాట్లాడని తాప్సీ, తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం ఓపెన్ అయిపోయింది.
Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?
ఈ ఇంటర్వ్యూలో ఈ సొట్టబుగ్గల సుందరి తన సీక్రెట్ పెళ్లి గురించి మాట్లాడింది. మథియాస్ బో తో పదేండ్లకు పైగా ప్రేమలో ఉన్నానని తెలిపింది. ఎప్పుడు ఈ విషయం దాచుకోలేదని, కానీ మీడియా తమను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. ఎన్నో సార్లు మీడియా కంట పడ్డామని, అయినా పట్టించుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. స్వయంగా తానే చెప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని అంది. అందుకే ఎక్కడ కూడా పెళ్లి గురించి మాట్లాడలేదని, అది తన పర్సనల్ విషయం అని పేర్కొంది. సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఎప్పుడు పోస్ట్ పెట్టలేదని చెప్పింది. అయితే తమ ప్రేమ ఎలా మొదలైందనేది మాత్రం చెప్పనని తెలిపింది. ఎవరికైనా తన ప్రేమ గురించి తెలియాలంటే.. తన లవ్ ఎపిసోడ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయండని చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. 2023 డిసెంబర్‌లోనే పెళ్లి చేసుకున్నామని, అదీ కూడా ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. దీనికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు వచ్చారని వెల్లడించింది. ఉదయపూర్‌లో జరుపుకుంది కేవలం పెళ్లి వేడుక మాత్రమేనని ఈ అమ్మడు విన్నవించింది. పర్సనల్ విషయాలు బయటికి చెప్పడం అంతగా ఇష్టం ఉండదని, అందుకే ఎప్పుడూ కూడా ఈ విషయం బయటికి ప్రస్తావించలేదని తెలిపింది. వ్యక్తిగత విషయాలు బయటికి చెబితే.. వర్క్ లైఫ్ దెబ్బతింటుందని పేర్కొంది. అయితే పెళ్లి గురించి బయటికి ఎప్పుడు చెప్పకపోవడంతో అందరూ సీక్రెట్ పెళ్లి అనుకున్నారని తాప్సీ క్లారిటీ ఇచ్చింది. అదన్నమాట తాప్సీ ప్రేమ, పెళ్లి వెనుక ఉన్న విషయం.