Urea
తెలంగాణ

Tummala Nageshwar Rao: యూరియా కొరత లేదు; ఆందోళన వద్దు

Tummala Nageshwar Rao:  రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళన చెందొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయాధికారులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి 2.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వము నుండి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిఉండగా, రాష్ట్రానికి 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరిస్తున్నామని, రాష్ట్రానికి కేటాయించిన దానిలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మార్క్ ఫెడ్ వద్ద ఉంచిన 3.08 లక్షల మెట్రిక్ టన్నులతో అవసరం మేరకు అన్ని జిల్లాలకు సరఫరా చేస్తూ ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే మా అధికారులు కేంద్ర అధికారులను కలవడం జరిగిందని, తాను ప్రత్యక్షంగా సంబంధిత మంత్రివర్యులకు లేఖల ద్వారా మా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేయాల్సిందిగా కోరామన్నారు.

బీజేపీ నేతలు  కూడా ఈ విషయంలో విమర్శలు మాని రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తమ వంతు కృషి చేస్తే బాగుంటుందని, పెరిగిన విస్తీర్ణం మరియు వినియోగం దృష్ట్యా రైతుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని తమ వంతు బాధ్యత తీస్కొని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్ధతు అందిస్తే మంచిదని హితవు పలికారు.. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి కేటాయించిన యూరియా వెంటనే సరఫరా చెయ్యాలని కోరమన్నారు.

గత యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణంతో పోల్చుకుంటే, ఈ సారి నీటి వనరులు, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల విస్తీర్ణంలో 5 నుండి 10 శాతం వరకు వృద్ధి నమోదైనట్టు, యూరియా వాడకం కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పటికే 1.9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా వినియోగించినట్టు మంత్రి తెలిపారు. అయినప్పటికి  పంటకాలం ప్రారంభం నుండే నిత్యం సమీక్షించుకుంటూ,  రైతులకు సరిపడ యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకున్నామని, వెస్సెల్స్ కానీ, రైల్వే వాగన్స్ కానీ రావడంలో ఎక్కడైనా, ఏదైనా జిల్లాకు ఆలస్యమైతే వెంటనే పొరుగుజిల్లాల నుండి తరలిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1.29 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, మొత్తం 81,800 మెట్రిక్ టన్నులు ఈ వారంలో సరఫరా అవుతుందని తెలియజేశారు. అధికారులు యూరియా సరఫరా విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, కృత్రిమంగా ఎవరైనా కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా  ఆదేశించారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?