Suhas: స్నేహితుడి మృతిపై యువ హీరో సుహాస్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ యువ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకంటూ ప్రత్యేకమైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన సుహాస్.. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అటు సినిమా లైఫ్‌లో బిజీగా ఉంటూ, ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫ్యామిలీ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా సుహాస్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన ప్రాణ స్నేహితుడు మనోజ్ సూసైడ్ చేసుకున్నట్లు తెలిపాడు.
Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?
మనోజ్ చాలా ధైర్యవంతుడు అని, ఎప్పడూ సంతోషంగా ఉంటాడని తెలిపాడు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావడం లేదని ఎమోషనల్ అయ్యాడు. మనోజ్ తీసుకున్న నిర్ణయం సరైందని కాదని అన్నాడు. ‘ఎంత పని చేశావ్‌రా నా కొడకా’ అని ఎండ్‌లో మెన్షన్ చేశాడు. ప్రస్తుతం సుహాస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుకు కొందరు రిప్లైలు కూడా ఇస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సుహాస్‌ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడటం బాధాకరమని, ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదనేలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌పై అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.
సుహాస్ విషయానికి వస్తే.. యూట్యూబర్‌గా మొదలుపెట్టిన సుహాస్.. ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు. హీరో కంటే ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ పాత్రలు చేస్తుండే వాడు. ‘కలర్ ఫోటో’ మూవీ నుంచి ఆకట్టుకునే కథలతో మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో, వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ చేతిలో హీరోగానే రెండు మూడు చిత్రాలున్నాయి. ఈ సమ్మర్‌లో ఆయన నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రం విడుదలకానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సుహాస్‌కు జంటగా మాళవిక మనోజ్ నటిస్తోంది. రామ్ గోధల ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయితున్నాడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. ఇక ఇప్పటికే విభిన్న కథలలో నటించి మంచి పేరు సంపాదించున్న సుహాస్.. ఈ చిత్రంతో మరో గొప్ప విజయాన్ని అందుకుంటాడని అంటున్నారు. సుహాస్ హీరోగా మినిమం బడ్జెట్‌తో రూపొందే సినిమాలతో నిర్మాతలకు లాస్‌లు తక్కువగా ఉండటంతో, ఆయనతో సినిమాలకు మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?