Megastar Chiranjeevi in Vishwambhara
ఎంటర్‌టైన్మెంట్

Vishwambhara: ఊహించని డీల్‌తో చిరు ‘విశ్వంభర’కి ఊపొచ్చింది!

Vishwambhara: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. చాలా గ్యాప్ తర్వాత అదే తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ‘అంజి’ తర్వాత మెగాస్టార్ చేస్తున్న గ్రాఫిక్స్ మూవీ ఇదే కావడం విశేషం. సరికొత్త టెక్నాలజీ యూజ్ చేస్తూ, ప్రేక్షకులను సరికొత్త యూనివర్స్‌లోకి తీసుకెళ్లేలా గ్రాండియర్‌గా ‘విశ్వంభర’ రూపుదిద్దుకుంటున్నట్లుగా వార్తలు వచ్చినా, ఈ మధ్య వచ్చిన టీజర్ ఆ వార్తలకు బ్రేక్ వేసింది. ముఖ్యంగా ఇందులో గ్రాఫిక్స్‌పై నెగిటివిటీ రావడంతో, సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి, ఆ డేట్‌ని ‘గేమ్ చేంజర్’కి కేటాయించారు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రొగ్రెస్ ఏమిటనేది తెలియడం లేదు, ఎప్పుడు విడుదల అనేది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో మెగాభిమానులలో నీరసం నెలకొంది. అలా నీరసంలో ఉన్న వారందరినీ యాక్టివ్ చేసేలా ‘విశ్వంభర’కు సంబంధించి ఇప్పుడొక వార్త సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అదేంటంటే..

Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

ఈ చిత్ర హిందీ థియేట్రికల్ రైట్స్ డీల్ సుమారు రూ. 38 కోట్లకు తెగినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి లాస్ట్ సినిమా ‘భోళాశంకర్’ ప్లాప్ చిత్రంగా నిలిచింది. అయినా కూడా, ఇటీవల రిలీజైన పాన్ ఇండియన్ మూవీస్ కంటే ఈ ప్రైస్ చాలా ఎక్కువే. ప్రస్తుతం హిట్ అని చెప్పుకుంటున్న ‘దేవర’, ప్లాప్ అని రిజల్ట్ వచ్చిన ‘గేమ్ చేంజర్’ హిందీ రైట్స్ కంటే ‘విశ్వంభర’ రైట్స్ డబుల్‌కి అమ్ముడవడంతో.. ఈ డీల్ మెగా వర్గాలకు కొత్త ఊపునిచ్చినట్లయింది. మరోవైపు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ సినిమా ఇటీవల సగానికి సగం నష్టాలను చవి చూసింది.. మరి చిరంజీవి మూవీకి అంత వస్తుందా? అనేలా క్వశ్చన్స్ రైజ్ చేసే వారూ లేకపోలేదు.

అందుకు కారణం, గతంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేశారు. ఇక హిందీ వెర్షన్ అమితాబ్ బచ్చన్‌ని పెట్టుకున్నప్పటికీ నష్టాలే చూడాల్సి వచ్చింది. కేవలం రూ. 10 కోట్లు మాత్రమే వచ్చాయి. సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించిన ‘గాడ్ పాదర్’ మూవీని కూడా హిందీలో రిలీజ్ చేశారు. కనిష్టంగా షేర్ రాబట్టింది. అలా చూస్తే, ఇప్పటి వరకు చిరంజీవి సినిమాలు అన్నీ హిందీలో నష్టాలే చవి చూశాయి. మరి ‘విశ్వంభర’ మూవీపై ఉన్న నమ్మకంతో ఎక్కువకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ వశిష్ఠపై మంచి అభిప్రాయం ఉంది. ఆయన చిత్రాలు అంటే ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. అందులోనూ చిరంజీవికి వీరాభిమాని కావడంతో.. ఈ సినిమాకు బలమైన కంటెంట్‌‌ని సమకూర్చి ఉంటాడని మెగాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:
Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Trivikram Srinivas: సినిమాలకు దూరం.. పవన్‌తోనే పయనం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు