Ajith Kumar
ఎంటర్‌టైన్మెంట్

Ajith Kumar : అజిత్‌కు తప్పిన ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Ajith Kumar : కోలీవుడ్ (kollywood) స్టార్ న‌టుడు అజిత్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట ఆయనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన సినిమాలు రిలీజ్ అయితే చాలు అభిమానులు హంగామా అంత ఇంత కాదు. ఇక అజిత్ సినిమాలతో అలరించడంతో పాటు కారు రేసింగ్‌లలో పాల్గొంటూ ఉంటాడు. అజిత్‌కు కారు రేసింగ్ (Car Racing) అంటే మహా పిచ్చి. గతంలో పలు రేసింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని మెడల్స్ సాధించిన ఘనత ఉంది. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల దుబాయ్‌లో ఓ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. తాజాగా స్పెయిన్‌లో పాల్గొన్న అజిత్ ప్రమాదానికి గురయ్యాడు. అతని కారు పలు పల్టీలు కొట్టింది. ముందుగా వెళుతున్న కారును క్రాస్ చేసే క్రమంలో ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో అజిత్‌కు గాయాలు కాలేదని తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యం కారులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే ముందు ఉన్న కారు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుకున్న అజిత్ కారు కంట్రోల్ తప్పింది. దీంతో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటన తర్వాత బయటికి వచ్చిన అజిత్ అభిమానులకు అభివాదం చేస్తూ.. ఫోటోలు దిగారు. మళ్ళీ తిరిగి కారు రేసింగ్ పోటీలో పాల్గొంటానని తెలిపారు. ఈ ప్రమాదంలో అజిత్‌కు గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also : Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?

కాగా, ఫిబ్రవరి నెలలో అజిత్ కుమార్ కారు రేసింగ్‌లో ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి. దీంతో అభిమానులు ఆయన్ని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పోర్చుగల్ లో జరిగిన కార్ రేసింగ్‌లో కూడా ఆయన కారు ప్రమాదానికి గురైంది. అక్కడ ప్రాక్టీస్ చేస్తుండగా కారు పల్టీలు కొట్టింది. ప్రాక్టీస్‌లో కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక ఈ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి తర్వాత ఇప్పుడు కారు రేసింగ్ లో పాల్గొని ప్రమాదానికి గురయ్యాడు. ఇక అజిత్ కుమార్ నటించిన తాజా మూవీ విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో విడుదలైంది. మేయిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఇక అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్, త్రిష అంద చందాలు మూవీకి హైలెట్‌గా నిలిచాయి.

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు