Slbc Accident : శ్రీశైలం ఎస్ ఎల్ బీసీ సొరంగ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం (sri shailam) ఎడమగట్టు కాలువ సొరంగం పై కప్పు కూలడంతో ఎనిమిది కార్మికులు అందులో చిక్కుకుని పోయిన సంగతి తెలిసిందే. వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ టన్నెల్ లో కార్మికులు చిక్కుకున్న దాకా వెళ్లడానికి సహాయక టీమ్స్ కు వీలు కావట్లేదు.
ఈ సొరంగ మార్గం ద్వారా 12 కి.మీ మేరకు వ్యాగన్లలో వెళ్లడానికి వీలుంటుంది. ఆ తర్వాత వ్యాగన్లు వెళ్లడం కష్టం అని చెబుతున్నారు. అక్కడి నుంచి అవసరం అయితే డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారంట. డీవాటరింగ్ కోసం టన్నెల్ లోపల ఐదు దశల్లో జనరేటర్లే ఏర్పాటు చేశారు కాబట్టి.. వాటి ద్వారా ట్యూబ్ లైట్లు కూడా ఏర్పాటు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్మీలో అనుభవజ్ఞులైన వారిని ఈ ఆపరేషన్ కోసం రప్పిస్తున్నారు. వారితో పాటు భారీ జేసీబీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.