Yuktha Mookhey
ఎంటర్‌టైన్మెంట్

Tallest Heroine: సినీ ఇండస్ట్రీలో హైట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Tallest Heroine: సినీ పరిశ్రమలోకి రావాలని అనుకునే వారికి అందం, అభినయంతో పాటు హైట్ కూడా ఎంతో ఇంపార్టెంట్. హీరోలకు తగ్గట్టుగా హైట్ ఉంటే ఓకే గానీ, లేదంటే ఇండస్ట్రీలో పొడుగు హీరోయిన్ల మనుగడ కష్టమే. దర్శకనిర్మాతలు ఎప్పుడూ హీరోకు తగ్గట్టుగానే హీరోయిన్‌ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్‌లో 6 అడుగుల పైన ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. దీంతో ఆరడుగులు ఉన్న అందగత్తెలు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఆ హైటే వారికి ఒక్కోసారి శాపంగా మారుతుంది. హైటున్న హీరోలతో ఓకే కానీ, మిగతా హీరోలు వారిని పట్టించుకోరు. అప్పుడు ఎంత అందంగా ఉన్నా.. అద్భుతంగా నటించగల సత్తా ఉన్నా.. హైట్ సమస్య వల్ల ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేరు. ఇటు టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఇలాంటి వారి సంఖ్య ఎక్కువే ఉంది. తన హైట్ కారణంగా సినిమా అవకాశాలను కోల్పోయిన ఇండస్ట్రీలోని టాలెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు.. మాజీ మిస్ వరల్డ్ ‘యుక్తాముఖి’. ఆమె పక్కన బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నిలబడితే ఆమెనే పెద్దగా ఉంటుంది. అంత హైట్ ఉంటుంది యుక్తాముఖి.

1999లో జరిగిన అందాల పోటీలలో యుక్తా ముఖి మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ కిరీటం గెలుపొందిన 4వ భారతీయ మహిళ ఈమెనే కావడం విశేషం.అంతేకాక, మిస్ ఇండియా కిరీటాన్ని కూడా అదే సంవత్సరం ఈ భామ సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో నటిగా, మోడల్‌గా రాణించింది. అయితే ఆ టైమ్‌లో యుక్తా హైట్ ఎక్కువ ఉండటంతో ఆమె సరసన నటించేందుకు హీరోస్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఎన్నో చిత్రాల్లో నటించే ఛాన్స్ కోల్పోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. యుక్తా లాస్ట్ సినిమా ఒడియాలో వచ్చిన ‘స్వయంసిద్ద’. ఇక సినిమాల్లో ఛాన్స్‌లు రాకపోవడంతో 2008లో న్యూయార్క్‌కు చెందిన బిజినెస్ మాన్ ప్రిన్స్ తులిని ఆమె పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ అయిన రెండు సంవత్సరాలకు వారికి ఒక బాబు పుట్టాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2013లోనే డైవర్స్ తీసుకున్నారు. భర్త తరపు కుటుంబ సభ్యులపై గృహ హింస, వేధింపుల ఆరోపణలు చేస్తూ యుక్తా కేసు కూడా పెట్టింది. ప్రస్తుతం యుక్తా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా వర్క్ చేస్తోంది.

Yukta-Mookhey
Yukta-Mookhey

బెంగళూరులోని సింధీ కుటుంబంలో పుట్టిన యుక్తా ఏడేండ్ల వయస్సు వరకు దుబాయ్‌లోనే నివసించింది. ఆ తర్వాత 1986లో యుక్తా కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఆమె తండ్రి ఓ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తుండగా.. తల్లి బ్యూటీషియన్‌గా పనిచేసేది. విద్యాభ్యాసం అంతా ముంబైలోనే జరిగింది.ఆప్టెక్ నుండి కంప్యూటర్ సైన్స్ డిప్లొమాను యుక్తా పొందింది. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా. ఇండస్ట్రీలో టాలెస్ట్ హీరోయిన్‌గా పేరు పొందిన యుక్తాముఖి హైట్ 5 అడుగుల 11 అంగుళాలు. టాలీవుడ్‌లో ఎక్కువ హైట్ ఉన్న హీరోయిన్ అనగానే మనకు గుర్తు వచ్చేది అనుష్క, అలాగే బాలీవుడ్‌లో దీపికా పదుకునే అనే అనుకుంటారు. కానీ, వీరిద్దరి కన్నా యుక్తా ముఖి హైటే ఎక్కువ. అందం, అభినయం వంటివన్నీ ఉన్నా కూడా హైట్ సమస్యతో ఇండస్ట్రీలో రాణించలేక పోయానని యుక్త ఈ ఇంటర్వ్యూలో బాధపడింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం