Buchibabu | ఆర్సీ–16 మూవీపై బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..
Buchibabu
ఎంటర్‌టైన్‌మెంట్

Buchibabu | ఆర్సీ–16 మూవీపై బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్.. ఇలా అన్నాడేంటి..?

Buchibabu | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​ తో డైరెక్టర్ బుచ్చిబాబు తీస్తున్న ఆర్సీ 16 (rc 16) పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా విషయాల్లో ఈ మూవీపై క్రేజ్ పెరుగుతోంది. రామ్ చరణ్ (ram charan) లుక్ తో పాటు ఇందులో నటించే ప్రతి పాత్ర లుక్ ఆకట్టుకునేలా బుచ్చిబాబు డిజైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఆర్సీ 16పై బుచ్చిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటుడు బ్రహ్మాజీ నటించిన లేటెస్ట్ మూవీ ‘బాపు’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ తో తీయబోయే మూవీ గురించి పెద్దగా ఆలోచించొద్దన్నాడు.

‘ఉప్పెన సమయంలో మా నాన్న చేసిన పని నాకు ఇంకా గుర్తుంది. ఆయన మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు. ఆయన ఆశలను నిజం చేయడానికే నేను దర్శకుడిగా మారాను. ఉప్పెన రిలీజ్ అయినప్పుడు ఆయన థియేటర్ గేటు బయట నిల్చుని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని సినిమా బాగుందా అని అడిగేవారంట. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు అలా అడగాల్సిన అసవరం లేదు. ఎందుకంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుంది. మెగా ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది కచ్చితంగా నెరవేరుతుంది’ అంటూ చెప్పుకొచ్చాబు బుచ్చిబాబు.

ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు మేకింగ్ పై అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే ఉప్పెన సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాను విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబుతో పృథ్వీరాజ్ సుకుమారన్, ఇతర సినిమా ఇండస్ట్రీల కీలక నటులు ఇందులో కనిపిస్తున్నారు. ఇప్పటికే సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అవుతుండటంతో అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.

రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. అందుకే ఈ సారి సాలీడ్ హిట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు మూవీతో ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం తమకు ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క