guillain barre syndrome
అమరావతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్

Guillain barre syndrome: జీబీఎస్​ డేంజర్​ బెల్స్

Guillain barre syndrome : గులియన్​ బార్​ సిండ్రోమ్(జీబీఎస్​) . ఈ పేరు వింటేనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వణుకుపడుతోంది. కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎంత పెరిగిందో… భయం కూడా అంతే పెరిగింది. ఎప్పడూ ఏ వైరస్ వచ్చి మీద పడి తమ ప్రాణాల్ని హరిస్తుందో అనే తెలియని బెరుకు మొదలైంది. తాజాగా జీబీయస్​ అలాంటి భయాన్నే కలిగిస్తోంది. అయితే అది నిజంగా అంత భయపడవలసిన వ్యాధేనా? తెలుసుకుందాం.

గులియన్​ బార్​ సిండ్రోమ్​ అనేది నరాల వ్యాధి. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కాదు. ప్రాణాంతకం కూడా కాదు. ఇటీవల కాలం దాకా మన దేశంలోనే దీని ఆనవాళ్లు తక్కువగా ఉండేవి. దీనిని మహారాష్ట్రలో తొలుత గుర్తించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలోనే తెలంగాణలో తొలి జీబీఎస్​ మరణం నమోదైంది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల ఓ మహిళ జీబీఎస్ కారణంగానే మృతి చెందింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె… మూడో కాన్పు అయిన కొద్ది రోజులకు నరాల నొప్పులతో అనారోగ్యం బారిన పడింది. హైదరాబాద్​ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చూపించి లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ వ్యాధి కారణంగా మహారాష్ట్రలోని పుణేలో పలువురు మృత్యువాత పడ్డారు.

మరోవైపు ఏపీలోనూ జీబీఎస్​ విజృంభిస్తోంది. ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఒక్కరోజే ఏడు జీబీఎస్​ కేసులు వచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరో ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. వారిలో ఇద్దరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాధితో దాదాపు 17 మంది చికిత్స పొందుతున్నట్లుగా తెలస్తోంది.

ఏమీటీ జీబీఎస్​ :
గులియన్​ బార్​ సిండ్రోమ్​… అనేది ముందే చెప్పినట్లు నరాల సంబంధిత వ్యాధి. మనకు జబ్బు చేసినప్పుడు లేదా ఇన్​ ఫెక్షన్​ సోకినప్పుడు మనకు అనుకూలంగా ఉండవలసిన రోగ నిరోధక శక్తి ప్రతికూలంగా మారడమే జీబీఎస్​ కు మూలం. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ …. దానికి బదులు నరాలపై దాడి చేస్తుంది. కాబట్టే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకరకంగా పక్షవాతం లాంటిదే. ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ముందే నయం చేయవచ్చు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఎనిమిది నెలల పిల్లల నుంచి మొదలుకొని ఎనభై ఏళ్ల వారి వరకూ కనిపిస్తోంది. ప్రధానంగా 50 నుంచి 74 ఏళ్ల వారిలో మరింత ఎక్కువ.

మన శరీరంలోని ప్రతి అవయవాన్ని మెదడు నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. శరీరంలోని అన్ని భాగాలకూ మెదడుకు నరాల ద్వారా సమాచార అనుసంధానం జరుగుతుంటుంది. అప్పుడు మెదడు అందించే సూచనల ఆధారంగానే మనం కాళ్లు, చేతులతో పాటు అన్ని అవయవాలనూ కదిలిస్తుంటాం. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే కదలికలకు సంబంధించిన సమాచారమంతా అందుతుంది. వెన్నెముక నుంచి కాళ్లు, చేతులు ఇతర శరీర భాగాలకు వెళ్లే నాడుల చుట్టూ ఉండే ఈ మైలీన్‌ పొరను యాంటీ బాడీలు దెబ్బతినడమే జీబీఎస్​ కు కారణం. మైలీన్‌ పొర క్షీణిస్తే నాడీ సంకేతాలు ఆగిపోతాయి. దాంతో కండరాల కదలికలు ఆగిపోతాయి. అలాంటప్పుడు బలహీనత ఎక్కువై… కండరాలు చచ్చుబడే ప్రమాదం ఉంది.

నివారణ :
కలుషిత ఆహారం, నీరు ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కాచి, వడపోసిన నీళ్లను తాగడం మంచిది. కూరగాయలు, పండ్లు మొదలైన వాటిని శుభ్రంగా కడుక్కొని తింటే బాగుంటుంది. మాంసం లాంటి పదార్థాల్ని బాగా ఉడికించుకొని తింటే మంచింది. ఒకవేళ జీబీఎస్ వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. అక్కడ దీనికి సంబంధించిన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడ చదవండీ :

cast census: నేటి నుంచి మరోసారి కుల గణన

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు