Medaram Jatara: మేడారం మోనాలిసా యంగ్ ఐపీఎస్‌పై ప్రశంసలు
Medaram Jatara (imagecredit:swetcha)
Telangana News

Medaram Jatara: మేడారం మోనాలిసా’.. యంగ్ ఐపీఎస్ అధికారిణిపై ప్రశంసల జల్లు!

Medaram Jatara: మేడారం మోనాలిసా ఎవరా అని అనుకుంటున్నారా..? అప్పటి మహా కుంభమేళా(ప్రయాగ్రాజ్- 2025)లో చిరు వ్యాపారిగా తన వద్ద ఉన్న రుద్రాక్ష దండలు అమ్ముకుంటూ వైరల్ అయిన 16 ఏళ్ల మోనాలిసాగా బొంష్లే “మోనాలిసా”గా పేరు తెచ్చుకుంది. ఆమె చిరునవ్వు, నీలి కళ్ళు, డేస్‌కి స్కిన్ సోషల్ మీడియా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆమె పేరు, సంగతి ఎందుకని అనుకుంటున్నారా..? తెలంగాణ కుంభమేళాలో కూడా ఓ మోనాలిసా మెరిసింది. అయితే మహా కుంభమేళా లో మెరిసిన మోనాలిసా రుద్రాక్ష దండలు అమ్ముతూ వైరల్ అయితే.. తెలంగాణ కుంభమేళ మహా మేడారం జాతరలో మెరిసిన మోనాలిసా మాత్రం ఐపిఎస్ అధికారిణి.

ఆదివాసీలతో కలిసి నృత్యాలు

మహా మేడారం తొలి రోజు సారలమ్మ గద్దల పైకి వస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister seethaka), జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లు కన్నేపల్లి ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ నృత్యాల్లో ఓ మోనాలిసా మెరిసింది. ఆమె ఎవరా..? అంటూ సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు.

Also Read; Om Shanti Shanti Shanti Review: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ

వసుంధర యాదవ్..

అయితే ఆమె ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. 2023 బ్యాచ్ కు చెందిన వసుంధర యాదవ్(Vasundhara Yadav) ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అక్కడ విధులు నిర్వహిస్తూ 2024లో తెలంగాణకు బదిలీపై వచ్చారు. వసుంధర యాదవ్ ఆమె 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ ను పెళ్లి చేసుకున్నారు. ఈయన కూడా ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహా కుంభమేళాలో రుద్రాక్ష దండలు అమ్ముతూ ఒక్కసారిగా మోనాలిసాగా పేరు పొందిన బొంష్లే అత్యంత నిరుపేద అయితే, తెలంగాణ కుంభమేళాలో మోనాలిసాగా మెరిసిన వసుంధర యాదవ్ మాత్రం ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం.

Also Read: Janasena MLA Controversy: ఎమ్మెల్యే రాసలీలల వివాదంలో ట్విస్ట్.. కీలక ఆధారాలు బయటపెట్టిన బాధితురాలు!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?