Om Shanti Shanti Shanti Review: సినిమా దర్శకులు హీరోలుగా మారడం చాలా అరుదుగా చూస్తుంటాం.. అలాంటి వారిలో ముందు ఉంటారు తరుణ భాస్కర్. తాజాగా తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shanti) సినిమా ధియేటర్లలో విడుదలైంది. ఇందులో తరుణ్ కు జోడీగా ఈషా రెబ్బా నటించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’కి రీమేక్ అయినా ఎక్కగా అలా అనిపంచదని ఇప్పటికే నిర్మాతలు దర్శకులు పలు మార్లు పెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ ‘గోదావరి యాస’ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.
Read also-Varun Dhawan: ‘బోర్డర్ 2’ సెట్స్‌లో వెన్నెముక విరగ్గొట్టుకున్న హీరో.. షాకింగ్ వీడియో వైరల్!
కథా నేపథ్యం
గోదావరి తీరంలో చేపల బిజినెస్ చేస్తూ విపరీతమైన కోపం, అహంకారంతో ఉండే యువకుడు ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్). తన మాట వినే భార్య కావాలని చిన్ననాటి నుంచి కలలుగంటాడు. అదే సందర్బంలో ప్రశాంతి (ఈషా రెబ్బా)ని పెళ్లి చేసుకుంటాడు. అమె కూడా తన మాట తూచా తప్పకుండా వింటుంది అనుకుంటాడు. పెళ్లైన కొత్తలోనే ఓంకార్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రతి చిన్న విషయాలకే ప్రశాంతిపై చేయి చేసుకుంటూ ఉంటాడు. భర్త వేధింపులకు మౌనంగా ఏడ్చే రకం కాదు ప్రశాంతి. తను అనుకోకుండా తీసుకున్న ఒక నిర్ణయం ఓంకార్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అహంకారి భర్తకు ప్రశాంతి ఎలా బుద్ధి చెప్పింది? అనేదే మిగిలిన కథ.
Read also-Kanchana Re-Release: హరర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మరింత క్లారిటీతో ‘కాంచన’ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
ఎవరు ఎలా చేశారంటే?
దర్శకుడు ఏఆర్ సజీవ్ ఒరిజినల్ కథలోని ఆత్మను దెబ్బతీయకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ముఖ్యంగా గోదావరి జిల్లాలకు దగ్గట్టుగా చిత్రీకరించారు. ఈ సినిమాకు ప్రధాన బలం తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న తరుణ్, నటుడిగా ఓంకార్ నాయుడు పాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా గోదావరి స్లాంగ్, కామెడీ టైమింగ్, క్లైమాక్స్‌లో తన అసహాయతను పండించిన తీరు అద్భుతం. ప్రశాంతి పాత్రలో ఈషా మెప్పించింది. గృహిణిగా ఆమె పడే వేదన, ఆ తర్వాత తన హక్కుల కోసం చేసే పోరాటంలో ఈషా నటన సెటిల్డ్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో ఈషా సర్ప్రైజ్ చేసింది. బ్రహ్మానందం, బ్రహ్మాజీ తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. సపోర్టింగ్ కాస్ట్ సినిమాకు మంచి వెయిట్ ఇచ్చారు. డైలాగ్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. మ్యూజిక్ సినిమాటోగ్రఫీ కలిసి సినిమా మూడ్‌ని ఎలివేట్ చేశాయి.
ప్లస్ పాయింట్స్
- తరుణ్ భాస్కర్
- కామెడీ
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
- ఊహించగలిగే కథ
- రిమేక్ అవ్వడం
రేటింగ్: 2.5 / 5

