తెలంగాణ

Kcr | 19న బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. పాల్గొననున్న కేసీఆర్..!

Kcr | బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేయాలంటూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (Kcr) నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం ఏర్పాట్లు నిర్వహించే బాధ్యత కేటీఆర్ తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నేతలు రావాలన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర పదవుల్లో ఉన్న వారంతా రాబోతున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ నిర్మాణంపై మాట్లాడనున్నారు. పార్టీ ఓడిపోయిన చాలా రోజుల తర్వాత ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రాజకీయ కార్యకలాపాలపై ఆయన మాట్లాడబోతున్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు.. బీఆర్ ఎస్ తీసుకోవాల్సిన యాక్షన్ గురించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?