The Raja Saab: ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన విషయం తెలిసిందే. అందులో ముందుగా ‘ది రాజా సాబ్’ (The Raja Saab)గా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), కలెక్షన్ల పరంగా మాత్రం అందరికంటే వెనుకపడ్డారు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు, హైప్ ఉన్నాయి. ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ ఇచ్చిన హైప్ అయితే అంతా ఇంతా కాదు. వాళ్లు ఏడుస్తూ.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. దర్శకుడు మారుతి అయితే ఇంటి అడ్రస్‌కు చెప్పేశాడు. ఒక్క సీన్ నచ్చకపోయినా, ఇంటికి వచ్చి అడగండి అని ఓవర్ కాన్ఫిడెన్స్‌ని వ్యక్తం చేశారు. దీంతో సినిమా అదిరిపోతుందని అంతా అనుకున్నారు. అందులోనూ ఈ బ్యాచ్ అంతా ఎప్పుడూ ప్రభాస్ చుట్టూనే ఉంటారు. కాబట్టి, సినిమా కచ్చితంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అంతా ఊహించారు. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమానే టాప్‌గా నిలుస్తుందని అనుకున్నారు. అందులో ప్రభాస్ క్రేజ్ మాములుగా ఉండదు. అందుకు పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన చిరు.. ఎప్పుడంటే?
లాస్కి ఆ ఇద్దరే కారణమా..
కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం సినిమా తడబడింది. డార్లింగ్ ప్రభాస్ అంత అవకాశం ఇచ్చినా, మారుతి సరిగ్గా సినిమా తీయలేదనేలా టాక్ వ్యాప్తి చెందింది. కొంతమందికి పాజిటివ్‌గా అనిపించినా, ఎక్కువ శాతం మంది నెగిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. దీంతో, విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. ప్రభాస్ కాబట్టి సగానికి పైగా కలెక్షన్స్ రాబట్టాడు కానీ, మరో హీరో అయితే సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచేది. అయితే ఈ సినిమాకు అయిన బడ్జెట్‌పై ఇప్పుడు రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు మారుతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ దాదాపు రూ. 100 కోట్లకు పైగా తినేశారని, అందుకే అంత బడ్జెట్ అయిందని, స్వయంగా నట్టి కుమార్ వంటి నిర్మాత మీడియా ముందు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read- Sumathi Sathakam Trailer: పిఠాపురం ఎమ్మెల్యేగారు చెప్పింది నిజమే.. ఏం చెప్పారు?
కలెక్షన్స్ తగ్గడానికి కారణమిదేనా?
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాకు అంత ఖర్చు కాలేదు. మధ్యలో మారుతి (Maruthi), ఎస్కేఎన్ (SKN) దాదాపు రూ. 100 కోట్లు తినేసి, నిర్మాత విశ్వప్రసాద్‌ని నిలువునా ముంచేశారు. నార్మల్‌గా సినిమా అనుకున్న బడ్జెట్లో అయిపోయి ఉంటే, నిర్మాతకు లాభాలు వచ్చేవి. ఖర్చు పెట్టింది తక్కువ, వెనకేసుకుంది ఎక్కువ అన్నట్లుగా నట్టి కుమార్ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కానీ, నట్టి కుమార్ చెప్పిన దానిలో ఎంత వాస్తవం ఉందనేది పక్కన పెడితే.. మారుతి, ఎస్కేఎన్ అలా చేసి ఉండరనేలా కూడా టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే, ప్రభాస్‌ని వాళ్లిద్దరూ ఎంతగానో ఆరాధిస్తారు. డార్లింగ్ ప్రభాస్‌కి హిట్ ఇస్తే.. మారుతి రేంజ్ కూడా మారిపోతుంది. అలాంటి సందర్భాన్ని, స్వార్థానికి ఎందుకు వాడుకుంటారు? కచ్చితంగా మంచి సినిమా తీయాలనే వారు ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. ఎక్కడో, ఏదో తేడా కొట్టింది అంతే. లేదంటే హెవీ కాంపిటేషన్‌లో రావడం కూడా కలెక్షన్స్ తగ్గడానికి కారణం అయి ఉండవచ్చనేలా ప్రభాస్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతుండటం విశేషం. ఏమో, ఏమి జరిగి ఉంటుందో.. వారికే తెలియాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

