Medaram Jatara: ఒక్కరోజే ఎంతమంది దర్శించుకున్నారంటే?
Huge crowd of devotees at Medaram Sammakka Sarakka Jatara
Telangana News, లేటెస్ట్ న్యూస్

Medaram Jatara: బాబోయ్.. మేడారంలో ఇవాళ ఒక్కరోజే ఎంతమంది దర్శనం చేసుకున్నారంటే?

Medaram Jatara: బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నానికి 80 లక్షల మంది దర్శనం!
సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి కోటికి మించే అవకాశం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మేడారం, స్వేచ్ఛ: మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో (Medaram Jatara) భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. మేడారంలో మీడియాతో చిట్ చాట్‌లో మంత్రి మాట్లాడారు. ఇవాళ (గురువారం) దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి వివరించారు.

మేడారం శాశ్వత అభివృద్ధికి 70 ఎకరాల విస్తరణ

మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. మొత్తంగా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు.

Read Also- NCP Politics: అజిత్ పవార్ మృతితో ఎన్‌సీపీలో మొదలైన పాలిటిక్స్!.. డిప్యూటీ సీఎం పదవి ఆమెకు ఫిక్స్?

బాసర-భద్రాచలం టెంపుల్ సర్క్యూట్

దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా భాగంగా చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు.

జంపన్న వాగు అభివృద్ధి ప్రణాళిక

జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రామప్ప–లక్నవరం–జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.

మేడారానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

దుష్ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి

సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు రోజుల్లోనే 70 నుంచి 80 లక్షల మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో అత్యంత తక్కువ సమయంలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థతో పాటు భారీ సంఖ్యలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతర విజయవంతానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం మరియు మీడియా మిత్రులకు సీతక్క అభినందనలు తెలిపారు.

Read Also- Shashi Tharoor: ఊహాగానాలకు చెక్.. రాహుల్ గాంధీకి ఎంపీ శశిథరూర్ బిగ్ సర్‌ప్రైజ్!

శనివారం వనప్రవేశం

శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అ ఎంఎల్ప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వన దేవత లను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు, పి.సి.సి. చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు మేడారం మహా జాతరలో వనదేవతలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, పిసిసి చీప్ మహేష్ కుమార్ దంపతులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శన ద్వారా మంత్రి దనసరి అనసూయ (సీతక్క) రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. గురువారం శ్రీ సమ్మక్క, సారలమ్మ లకు నిలువెత్తు బంగారం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగ అభివృద్ధి చెందాలని తల్లులను వేడుకున్నామని తెలిపారు. చరిత్రాత్మక కట్టడాలు దేశప్రజల దృష్టి నీ ఆకర్షిస్తున్నాయి. గతం కంటే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. వనదేవతలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా సుఖ సంతోషాలతో ఉంచాలని మహేష్ కుమార్ గౌడ్ వేడుకున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?