KCR SIT Notice: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ కు.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయ కక్షతోనే నోటీసులు పంపించారని ఆరోపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే సిట్ నోటీసులను ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ రావు అత్యవసరంగా భేటి కాబోటున్నట్లు తెలుస్తోంది.
హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం..
కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కోట్లాది మందికి ఆరాధ్యుడైన కేసీఆర్ పై సీఎం రేవంత్ సాగిస్తున్న రాజకీయ కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.’కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే.చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్ చౌకబారు రాజకీయాలకు ఇది పరాకాష్ట’ అంటూ ఎక్స్ వేదికగా హరీశ్ రావు మండిపడ్డారు.
తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్
స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2026
కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ భేటి!
సిట్ నోటీసుల నేపథ్యంలో మరికాసేపట్లో కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటి కాబోతున్నట్లు తెలుస్తోంది. నంది నగర్ లో సిట్ నోటీసులు అందుకున్న అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ వ్యవసాయ పంటలను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మామిడి తోటలోకి కారులో వెళ్లి అక్కడి కూలీలతో కేసీఆర్ మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు సైతం నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటి కానున్నట్లు సమాచారం.
Also Read: Delhi Murder: దిల్లీలో ఘోరం.. పోలీసు భార్యను.. డంబెల్‌తో కొట్టి చంపిన భర్త!
సిట్‌కు ఎలాంటి ఆన్సర్లు ఇవ్వాలి?
శుక్రవారం (జనవరి 30) జరబోయే సిట్ విచారణలో అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? వాటికి ఏ విధమైన సమాధానాలు ఇవ్వాలి? వంటి అంశాలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణను ఎక్కడ ఎదుర్కోవాలి అన్నదానిపై కూడా ఈ భేటిలోనే కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కాగా, కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. ఎక్కడ విచారణను ఎదుర్కొనే నిర్ణయం వారికే వదిలివేశారు. పీఎస్ కు వచ్చినా సరే లేదంటే మీరు చెప్పిన ప్లేసులోనైనా సరే విచారిస్తామని స్పష్టం చేశారు.

