Phone Tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. సిట్ (SIT) అధికారులు కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నందినగర్ లోని మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మరి నోటీసులు అందజేశారు. శుక్రవారం (జనవరి 30) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని అందులో సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటీవల హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) లను విచారించిన సిట్ అధికారులు.. ఇప్పుడు కేసీఆర్ ను నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది.
కేసీఆర్‌కు రెండు ఆప్షన్స్!
కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వంటి వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు పిలిపించి మరి విచారణ చేసిన సిట్ అధికారులు.. కేసీఆర్ కు మాత్రం రెండు ఆప్షన్స్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో పాటు, ఆయన వయసు 65 సంవత్సరాలు కావడంతో మీరు కోరుకున్న విధంగా విచారణ చేస్తామని నోటీసుల్లో కేసీఆర్ కు స్పష్టం చేశారు. మీరు పీఎస్ కు వచ్చినా సరే.. లేదంటే మీరు చెప్పిన చోటే దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. సిట్ నోటీసులపై లాయర్లతో చర్చించి కేసీఆర్.. తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎదురుదాడి..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలకు నోటీసులు వెళ్లడంపై ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం మెుదలైంది. అయితే దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల స్పీడ్ పెంచారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, పాలన చేయకుండా, హామీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. రాజకీయ వేధింపులు తప్ప విచారణలో ఏముండదని, ఇదో లొట్ట పీసు కేసు అని ఘాటు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ కు కూడా త్వరలో నోటీసులు ఇస్తారంటూ ఇటీవలే పదే పెదే చెబుతూ.. ప్రజల్లో సానుభూతి పొందేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి SIT నోటీసులు.రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఆదేశం
Phone tapping case – SIT officials issued notices to former CM @KCRBRSPresident and asked to appear before SIT tommorow at 3PM https://t.co/CHOuQEiqXh pic.twitter.com/Zyrj2MYqtQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026
Also Read: Medaram Jatara: మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెపైకి సారలమ్మ.. నేడు సమ్మక్క ఆగమనం!
గులాబీ నేతల్లో గుబులు
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక నేతలందరినీ సెట్ వరుసగా విచారణకు పిలుస్తుండడంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తాము మాట్లాడిన మాటలన్నింటినీ విన్నారా, వింటే పార్టీలో తమ పరిస్థితి ఏంటనేది ఒక వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కీలక నేతలపై కేసులు నమోదు అవుతుండడంతో భవిష్యత్‌లో పార్టీ పరిస్థితి ఏంటి? ఒక వేళ పార్టీలో ఉంటే భవిష్యత్ ఉంటుందా? ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే ఏం చేయాలి? పార్టీ ఆదుకుంటుందా? అనే సందేహాలు సైతం తొటి నేతలతో షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సిట్ దూకుడుతో గులాబీ నేతలను కలవరపెడుతున్నది.

