Revanth Reddy | హైదరాబాద్ లో ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. మైక్రోసాఫ్ కంపెనీతో హైదరాబాద్ కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీలు చాలానే ఉన్నాయని.. ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేయడం హైదరాబాద్ కు గర్వకారణం అన్నారు.
దావోస్ లో ఒప్పందం చేసుకున్నందున.. ఇది సాధ్యం అయిందన్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ లో చాలా పెట్టుబడులు పెడుతోందని.. ఈ కొత్త క్యాంపస్ ద్వారా 4వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. తాము దావోస్ లో ఒప్పందం చేసుకున్న చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉపాధి లభించే విధంగా తాము కృషి చేస్తున్నామని వివరించారు.