Prabhas
ఎంటర్‌టైన్మెంట్

Prabhas | కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో చెప్పిన విష్ణు..!

Prabhas | మంచు విష్​ణు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా కన్నప్ప. ఈ మూవీలో చాలా పెద్ద స్టార్లు నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నయనతార లాంటి వాళ్లు కూడా చేస్తున్నారు. ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో మూవీ షూటింగ్ జరుగుతోంది. బడా స్టార్లు నటిస్తుండటంతో మూవీపై ఆటోమేటిక్ గా హైప్ పెరిగింది.

అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ ఎన్నికోట్లు తీసుకున్నారనేది అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు వారి పారితోషికాల గురించి బయట పెట్టారు. ప్రభాస్, మోహన్ లాల్ కన్నప్ప సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశాడు. మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో వారు ఉచితంగానే చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తమకు ఉందంటూ వివరించాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్ లుక్స్ బయటకొచ్చాయి. అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తుండగా.. ప్రభాస్ రుద్ర పాత్రలో చేస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!