Kishan Reddy on Messi: తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారం ఒక కుదుపు కుదపగా, తాజాగా ఇదే సింగరేణి పేరెత్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ వచ్చినప్పుడు సింగరేణికి సంబంధించిన రూ.10 కోట్లు ఖర్చు పెట్టారంటూ (Kishan Reddy on Messi) ఆయన భగ్గుమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటోంది. వాడెవడో ఫుట్‌బాల్ ప్లేయర్ అంట. మెస్సీనో గిస్సీనో. వాడెవడో ఇతర దేశాల నుంచి వస్తే నా సింగరేణికి ఏం సంబంధమని నేను అడుగుతున్నా. సింగరేణికి సంబంధం ఏంటి?. సింగరేణి నుంచి తీసి రూ.10 కోట్లు ఖర్చుపెట్టారు. ఇక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి, జీతాలు పెంచడానికి డబ్బులు లేవు. మెడికల్ రీఎంబర్స్‌మెంట్‌కి డబ్బులు లేవు. కానీ, వాడెవడో మెస్సీ గాడు వస్తే వాడికి డబ్బులు ఇస్తారు. మెస్సీని ఆడించడానికి సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బుని వాడుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏ అధికారం ఉందని ప్రశ్నిస్తున్నాను’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also- Illegal Construction: ఎల్లంపేటలో అక్రమ నిర్మాణంపై అధికారుల చర్యలు శూన్యం.. కారణం ఎంటో..?
అప్పుడు ఏం చేశారండీ?
సీఎం రేవంత్ రెడ్డి మీద బ్లాస్ట్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మెస్సీ వచ్చినప్పుడు ఏం చేశారు మరి? అని ప్రశ్నించారు. రూ.10 కోట్లు వాడుకుంటే మీరేం చేస్తున్నారు మరి, మాటలు తప్ప చర్యలు ఏమైనా ఉంటాయా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా ఖర్చు చేసుకున్నారని తెలిసిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. కేంద్రమంత్రి అయ్యుండి ఏం చేశారు మరి, తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఏం చేశారు మరి? అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ‘‘మీ ఇంట్లో దొంగలు పడ్డ విషయం మీకు వేరే వాళ్లు చెప్పేదాక తెలియదంటే నమ్మబుద్ధి కావడం లేదు’’, అరుస్తావు కానీ, ఎంక్వైరీ మాత్రం చేయవు’’ అని పలువురు కామెంట్లు పెట్టారు.
డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మెస్సీ..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గతేడాది చివరిలో ఇండియా టూర్‌కి వచ్చాడు. డిసెంబర్ 13న హైదరాబాద్ నగరంలో పర్యటించాడు. ప్రత్యేక విమానంలో కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అతడికి ఘనస్వాగతం లభించింది. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను అలరించాడు. ఆ రోజు నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస చేశాడు. కొంతమంది అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు.
Read Also- Municipal Elections 2026: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

