Rashmika Mandanna: రష్మికా మందన్నా, విజయ్ దేవరకొండ.. ఈ రెండు పేర్లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి అని.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ వార్తలకు మరింత మసాలా ఇచ్చేలా.. ఇద్దరూ ఎక్కడబడితే అక్కడ కలిసి కనిపిస్తుంటారు. విజయ్ దేవరకొండకి సంబంధించినది ఏదైనా ఫస్ట్ అభిప్రాయం రష్మిక నుండి వస్తుంది, అలాగే రష్మికకి సంబంధించిన విషయాల్లో విజయ్ దేవరకొండ జోక్యం కనిపిస్తుంటుంది. అలా ఇద్దరూ అసలు గ్యాప్ ఇవ్వకుండా, ఏదో ఒక రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంటారు. తాజాగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ టైటిల్, టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌పై రష్మిక తన ఇన్‌స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రానికి ‘కింగ్‌డమ్’ (Kingdom) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్, చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలకు ముందే సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు స్టార్ హీరోస్ ఎన్టీఆర్, సూర్య, రణబీర్ కపూర్ వంటి వారు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా వచ్చిన వార్తలతో రెండు మూడు రోజులుగా VD12 ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ ట్రెండ్‌కు తగినట్లుగానే టీజర్‌లో వారి వాయిస్ ఉండటంతో, ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా యమా హ్యాపీగా ఉన్నారు. టీజర్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రష్మిక కూడా ఇన్‌స్టా వేదికగా ఈ టీజర్‌పై రియాక్ట్ అయింది.
‘‘ఈ మనిషి ప్రతిసారి ఏదో ఒక అద్భుతంతో మెంటలెక్కించేందుకు సిద్ధమవుతుంటాడు’’ అంటూ ‘కింగ్‌డమ్’ టీజర్‌పై రష్మిక పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చూసిన వారంతా.. అసలు ఎలా ఇలా? టీజర్ విడుదలైన సెకన్లలోనే పోస్ట్ పెట్టేశావుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌తో విజయ్ అంటే తనకు ఎంత స్పెషలో మరోసారి రష్మిక తెలియజేసిందంటూ కొందరు స్పష్టతకు వచ్చేస్తున్నారు. విజయ్, రష్మిక కలిసి నటించిన ‘గీత గోవిందం’ చిత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతుంది.