Bulli Raju Revanth Bhimala
ఎంటర్‌టైన్మెంట్

Bulli Raju Revanth: తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే.. ‘కొలికేస్తా మిమ్మల్ని కొలికేస్తా’!

BulliRaju Revanth Bhimala: సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఘన విజయం సాధించి, దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్‌గా నిలిచింది. అలాగే చాలా గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్‌కు సోలో హీరోగా సంతృప్తికరమైన హిట్‌ని అందించింది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌పై నమ్మకంతో విక్టరీ వెంకటేష్ సినిమా కోసం ఎంతగా ప్రమోషన్స్ నిర్వహించారో తెలియంది కాదు. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో కలిసి ఎన్నో ఈవెంట్స్‌లో ఆయన యమా యాక్టివ్‌గా కనిపించారు. పబ్లిక్ ఫంక్షన్లలో డ్యాన్స్‌లు చేశారు, కామెడీ చేశారు.. ఒక్కటేమిటి ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి ఏం కావాలో అది చేశారు. అయితే హీరోహీరోయిన్లతో పాటు ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన పాత్ర వెంకీ కుమారుడిగా బుల్లిరాజుగా నటించిన రేవంత్ పాత్ర. ‘కొలికేస్తా నిన్ను కొలికేస్తా నిన్ను’ అంటూ బుల్లిరాజు పాత్రలో రేవంత్ చేసిన కామెడీ సినిమా హైలెట్స్ ఒకటిగా నిలిచి, చిత్ర విజయంలో ఓ కీలక పాత్ర వహించింది. ఇప్పుడా పాత్రని మిస్ యూజ్ చేస్తూ కొందరు పొలిటికల్‌గా ఓన్ చేసుకుని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఎంతగా వారు రెచ్చిపోతున్నారంటే.. స్వయంగా రేవంత్ తండ్రి వివరణ ఇచ్చుకోవాల్సినంతగా, సోషల్ మీడియాలో రేవంత్ వీడియోలను పోస్ట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ పేరుతో ఫేక్ అకౌంట్స్‌తో జరుగుతున్న రచ్చపై రేవంత్ తండ్రి శ్రీనివాసరావు అధికారికంగా ఓ లేఖను విడుదల చేసి వివరణ ఇచ్చారు. ఈ లేఖలో..

‘‘అందరికీ నమస్కారం. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని మా అబ్బాయి చిరంజీవి రేవంత్ నటించిన పాత్రను ఆదరించి, ఆశీస్సులు అందచేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మా అబ్బాయి పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది.

మా అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు అండ్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో కేవలం @revanth_Bhimala అనే పేరు మీద ఉన్న ఇన్‌స్టాగ్రమ్ ప్రొఫైల్ నుండి మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాం. అది తప్ప.. ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రమ్ లలో మాకు ఎటువంటి ఇతర అకౌంట్స్, ఛానల్స్ లేవు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న విషయమై పోలీస్ వారికి ఫిర్యాదు చేశాం. దయచేసి మాకు, ముఖ్యంగా మా అబ్బాయిని ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడి పెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నాం’’ అని రేవంత్ తండ్రి శ్రీనివాసరావు కోరారు.

ఒక్క రేవంత్ అనే కాదు, ఈ మధ్య ఏ పాత్ర వైరల్ అయితే ఆ పాత్ర చేసిన నటుడితో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, ఇతర పొలిటికల్ పార్టీలపై నెగిటివ్‌గా కామెంట్స్ చేయడం కొందరు ఫేక్ రాయుళ్లకు పనిగా మారిపోయింది. హీరో, హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా అసలు సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియనివారి పేరు మీద కూడా అకౌంట్స్ ఉన్నాయంటే.. ముందు ముందు సోషల్ మీడియా ఎంత డేంజర్‌గా మారబోతుందో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ విషయానికి వస్తే.. వాళ్ల నాన్నే స్వయంగా వివరణ ఇచ్చాడు కాబట్టి, ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బుడ్డోడి పేరుపై ఫేక్ గాళ్ల ఆటలకు బ్రేక్ పడినట్లుగానే చెప్పుకోవచ్చు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?