Vijay Deverakonda VD12: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్‌పై ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. వార్తలే కాదు.. VD12 టైటిల్ ఇదేనంటూ కొన్ని టైటిల్స్ కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో రూపుదిద్దుకునే సినిమాలకు ముందుగానే కొన్ని టైటిల్స్ లీక్ అవుతుంటాయి. వాటిలో ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చిన టైటిల్‌ను సినిమా టైటిల్‌గా ఫైనల్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ సినిమాకు కూడా ముందుగానే ‘కింగ్‌డమ్’, ‘సామ్రాజ్యం’ అనే టైటిల్స్ వినిపించాయి. వీటిలో ‘కింగ్‌డమ్’ అనే టైటిల్‌నే మేకర్స్ ఖరారు చేసి, బుధవారం టీజర్‌ను కూడా వదిలారు.
ఈ టీజర్ ఎలా ఉందంటే..
‘‘అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా.. అలసిపోయినా ఆగిపోదిది మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరికోసం? అసలీ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మను ఎత్తిన నాయకుడి కోసం..’’ అంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌లో వచ్చిన ఈ టీజర్ సినిమాపై ఊహించని విధంగా అంచనాలను పెంచేస్తుంది. వెనుక భయంకరమైన వాయిస్‌లో ఎన్టీఆర్ మాట వినబడుతుంటే.. స్క్రీన్‌పై యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. చూస్తుంటే, ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండను ఊరిస్తున్న విజయం వరించేలానే ఉందీ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా టీజర్.
ఈ టీజర్ ప్రత్యేకత ఇదే..
పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ ‘కింగ్ డమ్’ సినిమా టీజర్‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. టాలీవుడ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తే, తమిళ వెర్షన్‌కు సూర్య, హిందీ వెర్షన్‌కు రణబీర్ కపూర్.. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, విజయ్ దేవరకొండకు నిజంగానే టైటిల్‌లాంటి కోటను విడుదలకు ముందే అందించారు. వీరి వాయిస్‌లో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ అవతార్ కూడా సరికొత్తగా ఉంది. ఇప్పటి వరకు అయితే విజయ్ దేవరకొండ ఇలా కనిపించలేదు.
‘కింగ్‌డమ్’ విడుదల ఎప్పుడంటే..
టీజర్‌తో పాటు మేకర్స్ చిత్ర విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ‘కింగ్‌డమ్’ సినిమా 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసి, ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాకు సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుంటే, జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే వారి పనితనం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. ఈ ‘కింగ్‌డమ్’ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.