Ration Cards | తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటుండటంతో ప్రజలు ఒకేసారి వెళ్తున్నారు. ప్రతి మీ సేవ కేంద్రం ముందు వందలాది మంది ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకేసారి వేలాదిగా అప్లికేషన్లు రావడంతో అప్లికేషన్ సైట్ ఆగిపోతోంది. దాంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మరోసారి స్పందించింది. ప్రజలు ఒకేసారి మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఇబ్బంది పడొద్దంటూ కోరింది.
రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని వివరించింది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని.. అందరూ పనులు విడిచిపెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. సైట్ ప్రాబ్లమ్స్ ను పునరుద్ధరిస్తున్నామని.. అందరి అప్లికేషన్లు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.