Ram Charan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వార్ పీక్స్ కు వెళ్తోంది. చాలా రోజులుగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ ఎవరూ బయటపడలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ చేసిన పనితో ఈ విభేదాలు పీక్స్ కు వెళ్లాయని తెలుస్తోంది. ఇన్ని రోజులు బన్నీ గురించి ఎక్కడా రామ్ చరణ్ మాట్లాడట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ (Ram Charan)ను ఫాలో అవుతూ వచ్చాడు. సడెన్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో బన్నీని అన్ ఫాలో చేశాడు చరణ్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు రామ్ చరణ్ ఎందుకు అన్ ఫాలో చేశాడనేది ఇంకా తెలియట్లేదు. అయితే రామ్ చరణ్ బన్నీ తమ్ముడైన అల్లు శిరీష్ ను ఫాలో అవుతున్నారు. ఉపాసన కూడా అల్లు అర్జున్ తో పాటు శిరీష్ ను ఫాలో అవుతోంది. కానీ ఒక్క రామ్ చరణ్ ఇలా ఎందుకు చేశాడన్నదే రచ్చ రచ్చ అవుతోంది. ఈ దెబ్బతో విభేదాలు పీక్స్ కు వెళ్లడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.
కొన్ని రోజుల క్రితమే సాయిధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో బన్నీకి జైలుకెళ్తే సినీ ఇండస్ట్రీ మొత్తం పరామర్శించినా.. రామ్ చరణ్ మాత్రం స్పందించలేదు. పుష్ప–2 సమయంలో మొన్న గేమ్ ఛేంజర్ సమయంలో ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఎంత వార్ జరిగిందో మనం చూశాం.