Chiranjeevi | ‘చరణ్ ఒక వారసుడిని ఇవ్వురా’.. చిరంజీవి కామెంట్స్
Chiranjeevi
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi | ‘చరణ్ ఒక వారసుడిని ఇవ్వురా’.. చిరంజీవి కామెంట్స్ వైరల్..!

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తన మూడోతరం వారసుడి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం కొడుకు రాగా గౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఈవెంట్ లో చిరంజీవి తన ఇంట్లో మనవరాళ్లతో దిగిన ఫొటోను చూపించింది యాంకర్ సుమ. ఆ ఫొటో గురించి మాట్లాడుతూ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘మా ఇంట్లో నేను ఉంటే.. నా చుట్టూ మనవరాళ్లు ఉంటారు. ఎప్పుడూ వాళ్లు నా చుట్టే ఉండటంతో నాకు నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా అనిపిస్తుంది. అందుకే నా కొడుకు రామ్ చరణ్ ను ఈ సారి నాకు ఒక అబ్బాయిని ఇవ్వురా అని అడుగుతున్నా. ఎందుకంటే మా ఇంట్లో ఒక్క అబ్బాయి కూడా లేడు. అందరూ ఆడపిల్లలే’ అంటూ నవ్వేశారు చిరంజీవి. దాంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తన మూడోతరం వారసుడిని కోరుకుంటున్నారంటూ పోస్టులు వస్తున్నాయి. మరి చరణ్​ దాన్ని నిజం చేస్తాడా లేదా అన్నది చూడాలి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..