Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ మళ్లీ వస్తున్నాడు..
Barabar-Premista
ఎంటర్‌టైన్‌మెంట్

Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ మళ్లీ వస్తున్నాడు.. ఎప్పుడంటే?

Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి.

Read also-Mogudu Movie: విశాల్ ‘మొగుడు’ గ్లింప్స్ రిలీజ్.. పాపం భర్త పరిస్థితి ఇలా ఉంటుందా..?

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో నిర్వహించారు. స్టూడెంట్ తో డాన్సులు చేసిన హీరో హీరోయిన్.. ఆపై ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించి అందరిలో జోష్ నింపారు. ఈ సందర్భంగా హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ .. ‘మా సినిమా ప్రమోషన్స్ ఈ కాలేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నా. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అని చెప్పుకొచ్చారు. హీరోయిన్ మేఘన ముఖర్జీ మాట్లాడుతూ .. ‘మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నా’ అని అన్నారు.

Read also-David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్.. రాకింగ్ యాక్షన్ ఎప్పుడంటే?

డైరెక్టర్ సంపత్ రుద్ర మాట్లాడుతూ .. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేదే మా బారాబర్ ప్రేమిస్తా సినిమా. ఇది ప్యూర్ తెలంగాణ బ్యాక్ ఓవర్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. అని వివరించారు. ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

Just In

01

Etela Rajender: మున్సిపోరుపై కమలం కసరత్తు.. రంగంలోకి ఎంపీ ఈటల!

BJP Telangana: మున్సిపోరుపై కమలం కసరత్తు.. ఉత్తర తెలంగాణపై ఫుల్ ఫోకస్!

Davos Summit: తెలంగాణ రైజింగ్ 2047కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్ధతు

GHMC Elections: గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

Illegal Admissions: ఇదెక్కడి విడ్డూరం.. 10వ తరగతి పూర్తవ్వకుండానే ఇంటర్ అడ్మిషన్లు!