Nagarjuna
ఎంటర్‌టైన్మెంట్

Nagarjuna | ఒక్క మాటతో శోభితను ట్రోల్స్ నుంచి బయట పడేసిన నాగార్జున..!

Nagarjuna | అక్కినేని నాగార్జున ఎట్టకేలకు శోభితను బయట పడేశాడు. ఇన్ని రోజులు విమర్శలు, ట్రోల్స్ తో ఆమె సతమతం అయిపోయింది. ఆమెను వాటి నుంచి బయట పడేసేందుకు నాగార్జున చేసిన పని ఏంటో ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య సమంతో విడాకులు తీసుకుని శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత.. ప్రతి విషయంలో శోభితను సమంతతో పోలుస్తూ ఏకి పారేస్తున్నారు కొందరు నెటిజన్లు. అందులోనూ సమంత లేడీ ఫ్యాన్స్ అయితే శోభితను తెగ తిట్టేస్తున్నారు. శోభిత వచ్చిన తర్వాతనే అక్కినేని వారి ఇంట్లో అశుభం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు అన్నీ ఇన్నీ కావు.

శోభితతో ఎంగేజ్ మెంట్ తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంతో పాటు.. అక్కినేని ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుందని ట్రోల్స్ చేశారు. అయితే తండేల్ సక్సెస్ మీట్ లో వాటన్నింటికి చెక్ పెట్టేశాడు నాగార్జున (Nagarjuna). శోభితతో పెళ్లి తర్వాత నాగచైతన్య నుంచి వచ్చిన మొదటి మూవీ తండేల్. ఇది భారీ హిట్ అయింది. నిన్న జరిగిన ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. ‘శోభిత మా ఇంటికి వచ్చిన వేళా విశేషం వల్లనే తండేల్ పెద్ద సక్సెస్ అయిందని’ క్రెడిట్ మొత్తం కోడలికి ఇచ్చేశాడు. అంటే తమ కోడలు తమకు అదృష్టమే తప్ప దురదృష్టం కాదని చెప్పకనే చెప్పేశాడన్నమాట. నాగార్జుననే స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఇకపై ఆమె మీద ట్రోల్స్ ఆగిపోతాయేమో చూడాలి.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!