Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా..
happy-raj
ఎంటర్‌టైన్‌మెంట్

Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా.. అబ్బాస్ రీ ఎంట్రీ అదుర్స్

Happy Raj: ప్రముఖ సంగీత దర్శకుడు నటుడు జివి ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి “వైబ్ చెక్” (Vibe Check) పేరుతో విడుదలైన ప్రోమోను టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో కేవలం సినిమాలోని పాత్రలను పరిచయం చేయడమే కాకుండా, నేటి తరం యువత ప్రేమ, పెళ్లి విషయాల్లో కలిగి ఉన్న భిన్నమైన ఆలోచనలను హాస్యభరితంగా కళ్ళకు కట్టింది. ఈ చిత్రంలో జి.వి. ప్రకాష్ కు జోడీగా ‘మడ్డీ’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా, నేటి కాలపు ప్రేమికులను ప్రతిబింబించేలా ఉంది. ఈ ప్రోమోలో ప్రధాన ఆకర్షణ సీనియర్ నటుడు అబ్బాస్. చాలా కాలం తర్వాత ఆయన తెలుగు తెరపై కనిపించడం అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. ‘ప్రేమ దేశం’ వంటి క్లాసిక్ సినిమాలతో మెప్పించిన అబ్బాస్, ఈ ప్రోమోలో ఒక ముఖ్య పాత్రలో మెరిశారు.

Read also-Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు

ఈ ప్రోమో ఒక సరదా గొడవతో ప్రారంభమవుతుంది. కేవలం ఒక గేమ్ ఆడుతూ కూడా ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోకూడదని అనుకునే ఈ జంట, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. హీరో తన పెళ్లి ఎంట్రీ చాలా మాస్‌గా, గ్రాండ్‌గా ఉండాలని కోరుకుంటాడు. దానికి భిన్నంగా హీరోయిన్ తన ఎంట్రీ మ్యాజికల్‌గా, ఒక ఫెయిరీ టేల్ లా ఉండాలని కలలు కంటుంది. పెళ్లి వేదిక విషయంలో వీరి మధ్య పెద్ద చర్చ జరుగుతుంది. హీరో గుడిలో సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే, హీరోయిన్ మాత్రం స్టార్ హోటల్‌లో మెక్సికన్ బఫే, సూట్లు, లెహంగాలతో మోడ్రన్ స్టైల్‌లో పెళ్లి కావాలని పట్టుబడుతుంది.

Read also-Ustaad BhagatSingh: పవన్ కోసం తన కలానికి మరింత పదును పెడుతున్న చంద్రబోస్.. ఇది వేరే లెవెల్..

సంప్రదాయం ప్రకారం ‘తాలి’ కట్టాలా లేదా వెస్ట్రన్ స్టైల్‌లో ‘రింగ్’ మార్చుకోవాలా అనే అంశంపై వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. సారెగమ తెలుగు సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి మారియా రాజా ఎలాంచెజియన్ సంగీతాన్ని అందించారు. ప్రోమోలోని నేపథ్య సంగీతం, విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. జి.వి. ప్రకాష్ తనదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, శ్రీ గౌరీ ప్రియ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. “ప్రేమ కోసం ప్రేమికులు తలబడితే పర్వాలేదు కానీ, ఈ ప్రేమ దేశము, ఖైదీ తలబడితే ఎలా ఉంటుందో” అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యువతకు నచ్చే అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే వినోదం ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు