Allu Arjun: ‘పుష్ప 2’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తన రేంజ్ పెంచుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ‘AA22xA6’ తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజ హెగ్డేను సెలక్ట్ చేశారన్న వార్త ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ‘అలా వైకుంఠపురంలో’ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మళ్లీ వీరిద్దరి హిట్ కాంబినేషన్ వస్తుందంటే అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందనే ధీమాతో ఉన్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుద్ కాంబినేషన్ కు పూజా హెగ్డే కూడా కలిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పూజా ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు పుష్ప 2 సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.
Read also-Ustaad BhagatSingh: పవన్ కోసం తన కలానికి మరింత పదును పెడుతున్న చంద్రబోస్.. ఇది వేరే లెవెల్..

