Honey Teaser: నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా..
honey-teaser
ఎంటర్‌టైన్‌మెంట్

Honey Teaser: నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. సైకలాజికల్ హారర్ చెమటలు పట్టిస్తుంది

Honey Teaser: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై సినిమా ప్రేక్షకులను సైకలాజికల్ థిల్లర్ లోకం లోకి తీసుకెళ్లింది. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ తో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతోంది. వెన్నులో వణుకు పుట్టించేలా వున్న టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఇప్పటివరకు మనం చూసిన హారర్ కు భిన్నంగా, హనీ టీజర్ పూర్తిగా.. నిశ్శబ్దం, చీకటి, మర్మమైన చూపులు, తెలియని శక్తులు ఇవన్నీ కలిసి ఒక మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి. దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడనే సంకేతాలు టీజర్‌లో బలంగా వినిపిస్తున్నాయి. హారర్‌ను కేవలం భయపెట్టే అంశంగా కాకుండా ఊహకు అతీతంగా ప్రజెంట్ చేస్తున్న విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ “ఏదో పెద్ద రహస్యం దాగుంది’ అన్న ఫీలింగ్ కలుగుతుంది.

Read also-Nidhhi Agerwal: ఆయన పీఎం అయినా ఆశ్చర్యపడను.. నిధి అగర్వాల్.. ఎందుకంటే?

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై నటించిన ‘హనీ’ టీజర్ డార్క్ సైకలాజికల్ హారర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని, అంచనాలను పెంచుతోంది. నవీన్ చంద్ర లుక్ పెర్ఫార్మెన్స్ స్టన్నింగ్ గా వుంది. దివి, రాజా రవీంద్ర పాత్రలు కూడా భిన్నంగా కనిపించాయి. అజయ్ అరసాడ సంగీతం బీజీఎం గూస్బంప్స్ తెప్పించింది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.

Read also-Tollywood Crisis: అందుకే సినిమాలు చూడలేకపోతున్నా.. ప్రముఖ నిర్మాత.. నీళ్లు కూడా దొరకవు..

Just In

01

Municipal Elections: పార్టీలకు మున్సిపల్ పరీక్ష.. అన్ని పార్టీలను దెబ్బతీస్తున్న సమస్య ఇదే!

Congress Party: గుండెపోటుతో ఓబీసీ నేత మృతి.. మంత్రి కోమటిరెడ్డి ఆపన్నహస్తం

Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా.. అబ్బాస్ రీ ఎంట్రీ అదుర్స్

Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు

ICC- Bangladesh: ఆడితే ఇండియాలో ఆడండి.. లేకపోతే గెటౌట్.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్‌కు ఐసీసీ క్లారిటీ