Urban Parks: తెలంగాణకు 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు
Urban Parks (imagecredit:twitter)
Telangana News

Urban Parks: తెలంగాణకు 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు.. జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసా..?

Urban Parks: తెలంగాణలో నూతనంగా మరో 6 అర్బన్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుటికే మూడు జిల్లాల్లో ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలనేదానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే స్థలాల గుర్తింపు ప్రక్రియను సైతం వేగవంతం చేశారు. ఈ పార్కులతో పర్యావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషించనుంది. ప్రజలకు మంచి వాతావరణం అందనుంది. ఈ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ‘నగర్ వన్ యోజన’ పథకం కింద నిధులు మంజూరు చేసింది.

పచ్చదనం పెంపొందించడమే లక్ష్యం

పట్టణాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద తెలంగాణకు ప్రోత్సాహం అందిస్తున్నది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో 6 కొత్త అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు గాను మొదటి విడుతలో 70 శాతం నిధులను మొత్తం రూ.8.26 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ పరిధిలోని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా వినియోగించనున్నారు. నగరాలు, పట్టణాల పరిధిలో అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ‘నగర్ వన్ యోజన’ కింద ఏర్పాటయ్యే అర్బన్ ఫారెస్ట్‌లలో స్థానిక వృక్ష జాలానికి ప్రాధాన్యం ఇస్తూ విస్తృతంగా మొక్కలు నాటనున్నారు. నడక మార్గాలు, విశ్రాంతి కేంద్రాలు, పచ్చని మైదానాలతో ప్రజలకు ప్రకృతి ఒడిలో విహరించే అవకాశం కల్పించనున్నారు. పిల్లలు, వృద్ధులు, ఉదయ, సాయంత్రపు వాకర్లకు ఈ అర్బన్ ఫారెస్ట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Also Read: Renu Desai: అందుకే తరచూ కాశీకి వెళ్తుంటానంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్..

మూడు జిల్లాల్లో..

రాష్ట్రంలో ‘నగర్ వన్ యోజన’ పథకం కింద మూడు జిల్లాలలోని 6 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావళా, యాపల్‌గూడలో అర్బన్ పారెస్టులను ఏర్పాటు చేయబోతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం (క్యాతనపల్లి మండలం), చెన్నూర్, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని యెల్లంపేట, చెంగిచెర్లలో ఫారెస్టులను ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు వల్ల పట్టణాల్లో హరితావరణం విస్తరించడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడనుంది. అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ‘నగర్ వన్ యోజన’ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే దిశగా ఈ అర్బన్ ఫారెస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

పార్కులు పర్యావరణానికి దోహదం

అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డా. సువర్ణ
అర్బన్ పార్కులతో ప్రజలకు నాణ్యమైన గాలి వాతావరణం కలుగుతుంది. కేంద్రం నగర వన్ యోజన పథకం కింద 6 అర్బన్ ఫారెస్టుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. ఆ పార్కులలో అన్ని రకాల మొక్కలను పెంచుతామని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డా. సువర్ణ తెలిపారు.

Also Read: Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు.. ఎంపీ రఘనందన్ రావు షాకింగ్ కామెంట్స్

Just In

01

Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?

Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!

Medchal News: అంబేద్కర్ భవన భూమి కబ్జాకు యత్నం కలకలం.. భూమిని కాపాడాలంటూ డిమాండ్..!

Sarkar Labs Drive: ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. చికిత్స ప్రక్రియ మరింత వేగవంతం..?