Manda Krishna | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనను తాము స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాతో ఆయన భేటీ అయ్యారు. ఆయన వెంట కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం చేసిన కులగణనతో పాటు రిజర్వేషన్ అంశాలను కూడా చర్చించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. కులాలను ఏబీసీడీ అనే విభాగాలుగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాకపోతే రిజర్వేషన్ పర్సెంటేజీ అంశాలపై తాము సీఎంకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు.
