Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం బడా స్టార్లు రంగంలోకి దిగుతున్నారు. విజయ్ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. అందులోనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేస్తారు. కాగా ఈ మూవీ టీజర్ కోసం ముగ్గురు స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. టీజర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.
తెలుగు వెర్షన్ కోసం జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, బాలీవుడ్ లో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్లు ఇవ్వబోతున్నారు. దాంతో మూవీపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టార్ హీరో అంటే మూవీ టీమ్ ప్లాన్ మామూలుగా లేదు. ఈజీగానే మూవీకి ప్రమోషన్ వచ్చేస్తోంది. బాలీవుడ్ లో రణబీర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో నార్త్ లో పెద్దగా ప్రమోషన్లు చేయకున్నా మూవీ గురించి అందరికీ తెలిసిపోతోంది. ఇటు తమిళ్ లో సూర్య వాయిస్ ఉంటే ఇంక చెప్పక్కర్లేదు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తోడైతే ఇక మామూలుగా ఉండదు. మరి రేపు టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.