Renu Desai: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఆమె కుక్కల గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అందులో ఎం అన్నారంటే?.. తనను కాపాడటానికి ఎవరూ లేరని, అమ్మా నాన్న, అన్నయ్య, భర్త ఇలా ఎవరూ లేరు. వీధి కుక్కల అంశంలో నా తప్పు లేకున్నా.. ఎంతో మంది నన్ను విమర్శిస్తున్నారు. అది చాలా బాధను కలిగిస్తుంది. నా వెనకాల వెవరూ లేరనేకధా ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఏమైనా మాట్లాడండి నేను స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధను చెబుతాను. నాకు బాధ కలిగిన ప్రతిసారీ కాశీ వెళ్తుంటాను అందుకే’ అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పడు తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన కొందరు మేము ఉన్నామంటూ అభిమానులు ముందుకొస్తున్నారు. మరి కొందరు అయితే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మని ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి మరి.
Read also-Ticket Hike: సినిమా టికెట్ల వివాదంపై మరో సారి సీరియస్ అయిన తెలంగాణ హైకోర్ట్..

