VK Naresh: నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ (VK Naresh) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శుభకృత్ నామ సంవత్సరం’ (Shubhakruth Nama Samvatsaram). ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వికె నరేష్ మాట్లాడుతూ..
Also Read- Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!
మహేష్ తర్వాత శ్రీ విష్ణునే..
‘‘మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్‌కి పేరుపేరునా కృతజ్ఞతలు. మా కుటుంబంలో ఏదైనా సరే మాతో వచ్చి నిలబడే ఫ్యాన్స్‌ని సూపర్ స్టార్ కృష్ణ మాకు ఇచ్చెళ్లారు. రామోజీరావు, జంద్యాల నాకు ఒక ఫ్యామిలీ. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు మరో ఫ్యామిలీ లాగా వచ్చారు. నాకోసం దర్శకులు ఒక క్యారెక్టర్ రాయడం అనేది నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. శ్రీ విష్ణు మై హీరో. మహేష్ తర్వాత అంత మంచి షటిల్డ్‌గా ఉండే టైమింగ్ తనలోనే చూశాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా ముందుకు వెళ్తున్న కొద్ది… లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే నేను ప్రతిదీ క్యారెక్టర్‌గానే చూస్తాను. నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చిన ప్రతి డైరెక్టర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు.
Also Read- Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్.. అనసూయ షాకింగ్ పోస్ట్!
టికెట్స్ దొరక్క షాకయ్యాను
తెలుగు కన్నడ సిస్టర్ లాంగ్వేజ్. ఒకటే లిపితో పాటు, కల్చర్ దగ్గరగా ఉంటుంది. ‘శుభకృత్ నామ సంవత్సరం’ కథ నాకు చాలా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఇది డ్రామా సస్పెన్స్ ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. తెలుగు కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్‌తో వస్తున్న సినిమా. ఈ టైటిల్ వినగానే అందరూ చాలా పాజిటివ్‌గా స్పందిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మంచి సాధించే అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు, కన్నడలో చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం మన తెలుగు సినిమా కళకళలాడాలని కోరుకుంటున్నాను. ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్దామని అనుకున్నాను. కానీ, ఎక్కడ చూసినా.. అన్నీ హౌస్ ఫుల్స్ వున్నాయి, ఫస్ట్ టైం నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు. నిజంగా షాక్ అయ్యాను. మల్టీప్లెక్స్‌లో కూడా కేకలు అరుపులతో సినిమా చూస్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి నిజంగా నేనే షాక్ అయ్యారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇండస్ట్రీలో ది గ్రేట్ టైమ్. ఈ సినిమా కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ శుభ కృత నామ సంవత్సర శుభాకాంక్షలు..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

