MP Chamal Kiran: దావోస్‌‌ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Bhuvanagiri MP Chamal Kiran Kumar Reddy in front of the World Economic Forum backdrop at Davos
Telangana News, లేటెస్ట్ న్యూస్

MP Chamal Kiran: దావోస్‌ ‘వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్’ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamal Kiran: 

దావోస్/యాదాద్రి భువనగిరి, స్వేచ్ఛ: డావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొంటున్న బృందంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamal Kiran Kumar Reddy) కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన దావోస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వనితి (Swaniti) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది మెరిడియన్ కలెక్టివ్ – సబ్‌నేషనల్ కమిట్‌మెంట్ చార్టర్’ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలన, స్థిరమైన వృద్ధిపై రాష్ట్రం తీసుకుంటున్న కట్టుబాట్లను అంతర్జాతీయ వేదికపై ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులతో కలిసి రాష్ట్రాల పాత్ర, ఉప జాతీయ స్థాయిలో విధాన అమలు, ప్రజా ప్రయోజనాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మరింత బలపడనుందని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. దావోస్ వేదికపై తెలంగాణ ప్రగతి, పెట్టుబడుల అవకాశాలు, భవిష్యత్ అభివృద్ధి దిశలను ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Read Also- Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!

Just In

01

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి