Beer Price | మందుబాబులకు షాక్ తగిలింది. తెలంగాణలో బీర్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా బీర్లలో కింగ్ ఫిషర్ వాటా 69 శాతం ఉంది. ఎక్కువగా కింగ్ ఫిషర్ బీర్లనే తాగుతుంటారు. అయితే సంక్రాంతికి ముందు బ్రూవరీస్ యునైటెడ్ లిమిటెడ్ వాల్లు బీర్లను సరఫరా చేయడం కుదరదని చెప్పారు. ఎందుకంటే 2019 నుంచి బీర్ల ధరలు (Beer Price) పెంచలేదు. రెండేళ్లకు ఒకసారి బీర్ల ధరలు పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం పెంచలేదు. దాంతో బీర్ల సరఫరా ఆపేస్తామంటూ బ్రూవరీస్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి.. ధరలు పెంచుతామని హామీ ఇవ్వడంతో సరఫరా చేస్తున్నాయి. తాజాగా ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బీరు ధరపై 15 శాతం పెంచింది. అంటే కింగ్ ఫిషర్ బీర్లపై రూ.18 వరకు పెరగనున్నాయి. మిగతా బడ్వైజర్, టుబార్గో, కరోనా బీర్ల ధరలు కూడా 15 శాతం వరకు పెరుగుతాయి. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
