Ramchander Rao: రాష్ట్రంలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండబోతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) వ్యాఖ్యానించారు. శనివారం సికింద్రాబాద్‌లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు వెయ్యి స్థానాల్లో గెలిచామని, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదు: రాంచందర్ రావు
కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ
రాష్ట్రంలో పార్టీకి బలం భారీగా పెరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండబోతున్నదని, బీఆర్ఎస్ త్వరలోనే భూస్థాపితం అవ్వబోతున్నదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని, 40 శాతం కమీషన్ సర్కార్ అని రాంచందర్ రావు ఆరోపించారు. నగరాల అభివృద్ధికి కాంగ్రెస్ చేసింది శూన్యమని పేర్కొన్నారు. ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కమలనాథులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. త్రివేండ్రంపై బీజేపీ జెండా ఎగురవేశాని, తొలిసారి ముంబైలో కార్పొరేషన్ కైవసం చేసుకున్నామని, తెలంగాణలోనూ 2028లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేయాలని సూచించారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదు: రాంచందర్ రావు

