Allu Aravind
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind | దయచేసి నన్ను వదిలేయండి.. మెగా ఫ్యాన్స్ కు అల్లు అరవింద్ రిక్వెస్ట్..!

Allu Aravind | గేమ్ ఛేంజర్ సినిమాపై తాను చేసిన కామెంట్స్ పై ఎట్టకేలకు అల్లు అరవింద్ స్పందించాడు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గురించి మాట్లాడుతూ.. సంక్రాంతికి ఓ సినిమాను పడుకోబెట్టి మరో ఎక్కడికో తీసుకెళ్లాడని అరవింద్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అరవింద్ గేమ్ ఛేంజర్ సినిమాను, రామ్ చరణ్​ ను అవమానించాడని ట్రోల్స్ చేశారు. అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా అల్లు అరవింద్ స్పందించాడు. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తాను ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదని చెప్పుకొచ్చాడు. ‘దిల్ రాజును పరిచయం చేస్తూ ఆ వారం రోజులు అతను పడ్డ కష్టాలను చెప్పే క్రమంలో ఆ విధంగా అన్నానని’ తెలిపారు.

‘దాన్ని మెగా ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుని నా మీద ట్రోల్స్ చేశారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను. చరణ్​ నా కొడుకు లాంటి వ్యక్తి. నాకున్న ఏకైక మేనల్లుడు చరణ్​. అతనికి ఉన్న ఏకైక మేనమామను నేను. అలాంటిది అతని మీద నేనెందుకు కావాలని అలా అంటాను. రామ్ చరణ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని, నన్ను ఇక్కడితోనే వదిలేయాలని నేను మెగా ఫ్యాన్స్ ను కోరుతున్నాను’ అంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. తండేల్ ప్రెస్ మీట్ లో కొందరు రిపోర్టర్లు అడిగినా అది సమయం కాదని తాను రియాక్ట్ కాలేదని వివరణ ఇచ్చారు. మరి అల్లు అరవింద్ ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యాన్స్ శాంతిస్తారా లేదా అనేది చూడాలి.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?