Chilukuru Rangarajan
తెలంగాణ, హైదరాబాద్

Chilukuru Rangarajan | రంగరాజన్ కి కిషన్ రెడ్డి హామీ

చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్ (Chilukuru Priest Rangarajan) పై జరిగిన దాడిపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం, బాధాకరం, దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్ (Rangarajan).. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి” అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి.. అసలు కారణం ఇదే..!

సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు. భారతీయ జనతాపార్టీ రంగరాజన్ కి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!