Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే..
Harsha Vardhan on Anasuya (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

Harsha Vardhan: ఇటీవల టాలీవుడ్‌లో రచ్చ రచ్చ అయినటువంటి ‘కాంట్రవర్సీ’పై తాజాగా నటుడు, దర్శకుడు హర్ష వర్ధన్ (Harsha Vardhan) చాలా సున్నితమైన సమాధానంతో క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది చర్చించకుండా, ఎవరికి తగలాలో వారికి తగిలేలా చక్కటి సమాధానమిచ్చారు. అసలు మొన్నటి ఇష్యూలో అనసూయ (Anasuya) మాట్లాడుతూ.. అమ్మాయిలకు డ్రస్సులు సరిగా వేసుకోమని చెప్పిన శివాజీ (Sivaji), అదే సమయంలో అబ్బాయిలకు కూడా కాస్త హితబోధ చేసి ఉండే బాగుండేదనేలా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సున్నితమైన అంశంపైనే తనదైన శైలిలో హర్ష విశ్లేషించారు. ముఖ్యంగా ‘మహిళల వస్త్రధారణ’, ‘పురుషుల దృక్పథం’ అనే రెండు అంశాల మధ్య ఉన్న సన్నని గీతను ఆయన వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది.

Also Read- Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా ఉంటుంది

దొంగ మనసు – ఇంటి తాళం

వీడియోలో హర్ష చెప్పిన మెయిన్ పాయింట్ ‘దొంగ మనసు మార్చడం కంటే, ఇంటికి తాళం వేయడం సులభం’. దీని అర్థం పురుషుల ఆలోచనా విధానాన్ని మార్చడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. కానీ, మన ఇంట్లో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పడం మన చేతుల్లో ఉన్న పని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది బాధితులను నిందించడం కాదు, మన నియంత్రణలో ఉన్న జాగ్రత్తల గురించి మాట్లాడటం. వస్త్రధారణనే పూర్తి స్వేచ్ఛగా భావించడాన్ని ఆయన తప్పుబడుతూ చేసిన కామెంట్స్ కూడా బహుచక్కగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘స్వేచ్ఛ అనేది ఒక విస్తృతమైన పదం.. స్వేచ్ఛలో బట్టలు ఉన్నాయి కానీ, బట్టలే స్వేచ్ఛ కాదు. ఒక మంచి ఉద్దేశ్యం ఉన్నవాళ్లు ప్రజంటేషన్‌లో రాంగ్ అయితే.. ఒక శివాజీ, ఒక అనసూయ అవుతారు. చదువుకోవడం, నచ్చిన ఆహారం తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లడం, మంచి రిలేషన్‌షిప్‌లో ఉండటం.. ఇవన్నీ స్వేచ్ఛలో భాగమే. వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే తప్ప, అదే పూర్తి స్వేచ్ఛ కాకూడదు. మనం ఎంచుకునే వస్త్రధారణ మన చుట్టూ ఉన్న పరిస్థితులకు, మన సంస్కృతికి తగినట్లుగా ఉండటం వల్ల అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.

Also Read- Chikiri Chikiri Song: ‘పెద్ది’ మేనియా.. మరో ఘనతను సాధించిన ‘చికిరి చికిరి’ సాంగ్!

అనసూయ డ్రెస్సింగ్‌పై హాట్ కామెంట్స్

నటి అనసూయ డ్రెస్సింగ్‌పై కూడా హర్ష తనదైన విశ్లేషణ ఇచ్చారు. అనసూయ వేసుకునే డ్రస్‌పై ఆమె పెద్ద కుమారుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. డ్రస్సులపై బయటి వారు విమర్శించినప్పుడు వినిపించుకోకపోయినా, ఇంట్లోనే తన కన్న బిడ్డ ‘అమ్మా నువ్వు వేసుకునే ఈ దుస్తులు నాకు నచ్చడం లేదు’ అన్నప్పుడు అది ఆలోచించాల్సిన విషయమని ఆయన అన్నారు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. మన వ్యక్తిగత ఇష్టాలు మన కుటుంబ సభ్యులను లేదా మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించాలని కోరారు. ‘‘హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను మర్చిపోకూడదు. సమాజం మారాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ సమాజం మారే వరకు మన రక్షణ కోసం మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది’’ అనేలా హర్ష వర్ధన్ ఇచ్చిన విశ్లేషణ చాలా ప్రాక్టికల్‌గా, నేటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉందని చెప్పవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!