Tiger Of Martial Arts: భారతీయ సినీ తెరపై మార్షల్ ఆర్ట్స్ (Martial Arts) అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లలో పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) ముందు వరుసలో ఉంటారు. సినిమాల్లో కేవలం ఫైట్లు చేయడమే కాకుండా, నిజజీవితంలో కూడా యుద్ధ కళలను ఒక జీవన విధానంగా మలుచుకున్న ఈ ఇద్దరు యోధుల మధ్య సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ నడిచింది. రీసెంట్‌గా శరీరంపై వస్త్రాలు లేకుండా చెట్టు ఎక్కుతూ కనిపించి విద్యుత్ జమ్వాల్ ఎలా వైరల్ అయ్యారో తెలియంది కాదు. మళ్లీ ఆయన పవన్ కళ్యాణ్‌పై వేసిన ట్వీట్స్‌తో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారారు. ఆ విషయంలోకి వెళితే..
Also Read- The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..
పవన్ కళ్యాణ్‌కు అభినందనలు
మార్షల్ ఆర్ట్స్ రంగంలో పవన్ కళ్యాణ్ ‘గ్రాండ్ మాస్టర్’ హోదాను అందుకున్న విషయం తెలిసిందే. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ (Tiger Of Martial Arts) అనే బిరుదును కూడా కైవసం చేసుకుని రేర్ హానర్ పొందరు. ఈ విషయంపై విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘మాస్టర్ పవన్ కళ్యాణ్, మీ స్థాయిని గ్రాండ్ మాస్టర్‌గా గుర్తించడం పట్ల నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను. మీ అసాధారణ నైపుణ్యాలకు ఇది సరైన గుర్తింపుగా భావిస్తున్నాను. క్రమశిక్షణను, యోధుల స్ఫూర్తిని అనుసరించే ఎంతో మందికి మీ జర్నీ ఒక స్ఫూర్తి’’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ బిరుదు తీసుకుంటున్న ఈవెంట్‌కు సంబంధించిన పిక్‌ని ఆయన జత చేశారు.
Also Read- Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!
పవన్ కళ్యాణ్ స్పందనిదే..
విద్యుత్ జమ్వాల్ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ అంతే హుందాగా సమాధానమిచ్చారు. యుద్ధ కళల పట్ల అంకితభావం ఉన్న మరో సాధకుడి నుంచి ఇలాంటి మాటలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కళ్ళరిపయట్టు (Kalaripayattu) వంటి మన భారతీయ పురాతన యుద్ధ కళలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో మీ కృషి అభినందనీయం. క్రమశిక్షణను, మన వారసత్వాన్ని సినిమా ద్వారా ఇంత నిజాయితీగా ప్రదర్శించడం గొప్ప విషయమంటూ విద్యుత్ జమ్వాల్‌ను పవన్ ప్రశంసించారు. వీరి ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కేవలం సినిమా సెలబ్రిటీల మధ్య జరిగిన సంభాషణ కాదని.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు అవతలి వ్యక్తిలోని ప్రతిభను ఎంతగా గౌరవిస్తారో ఇక్కడ స్పష్టమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇద్దరిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటనతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వారే నిజమైన ‘మాస్టర్స్’ అని నెటిజన్లు సంబోధిస్తున్నారు.
Dear @VidyutJammwal,
Thank you for your generous words. Coming from a fellow practitioner who is deeply committed to martial arts, this truly means a lot.
Your dedication to Kalaripayattu and your efforts to take our martial traditions to a wider audience are inspiring. It’s… https://t.co/4S2G0I6vVB
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 16, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

