Miracle First Look: సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాకిల్” సంక్రాంతి సందడిని మొదలుపెట్టింది. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాల ద్వారా దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రభాస్ నిమ్మల ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జనవరి 16న సంక్రాంతి కానుకగా విడుదల చేయగా, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ పోరాట సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తన రెండో షెడ్యూల్‌ను ఈనెల 22 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోవడానికి సిద్ధమైంది.
Read also-Marriage Rumours: వాలెంటైన్స్ డే రోజున ధనుష్, మృణాల్ పెళ్లి? వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!
రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గ్లామర్ క్వీన్ హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర నున్న సుజన మరో కీలక పాత్రలో కనిపించనుంది. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండటం విశేషం. విలన్‌గా నాయుడు పెండ్ర పరిచయమవుతుండగా, సీనియర్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇంకా ఆమని, ఝాన్సీ, యోగి కాత్రే, విజయ్ సూర్య వంటి భారీ తారాగణం ఈ యాక్షన్ డ్రామాలో భాగమయ్యారు. శ్రీమతి జ్యోత్స్న సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకుంటోంది.
Read also-The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..
దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రానికి కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే మరియు సంగీతాన్ని కూడా అందిస్తుండటం ఒక విశేషం. హెబ్బా పటేల్ గ్లామర్, సీనియర్ నటుల నటన మరియు అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, విశ్వనాధ్ ఎడిటింగ్, రాంబాబు గోసాల సాహిత్యం అందిస్తున్న ఈ “మిరాకిల్” బాక్సాఫీస్ వద్ద నిజమైన మిరాకిల్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

