Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు 2 రోజుల గ్రాస్ ఎంతంటే?
anaganaga-oka-raju-2 nd day
ఎంటర్‌టైన్‌మెంట్

Anaganaga Oka Raju: పండక్కి రాజు గారి హవా మామూలుగా లేదుగా.. రెండ్రోజుల గ్రాస్ ఎంతంటే?

Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, నవీన్ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 41.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్’గా దూసుకుపోతోంది. తొలిరోజు నుండే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, వీకెండ్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Read also-Marriage Rumours: వాలెంటైన్స్ డే రోజున ధనుష్, మృణాల్ పెళ్లి? వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్ ఎనర్జీతో వన్ మ్యాన్ షో చేశారు. పెళ్లి వేడుకల నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక కథలో, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అత్యున్నత నిర్మాణ విలువలతో దీనిని తెరకెక్కించాయి. కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచిన తీరు, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.

Read also-PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

సంక్రాంతి సీజన్ కావడంతో సెలవులను వాడుకుంటూ బి సెంటర్ల నుండి ఓవర్సీస్ వరకు అన్ని చోట్లా ‘రాజు’ హవా కొనసాగుతోంది. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, పక్కా వినోదాన్ని నమ్ముకుని వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ థియేటర్లకు రప్పిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Just In

01

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!