Theatre Tragedy: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా హీట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాదులోని సినిమా ఆడుతున్న థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు సినిమా చూస్తున్న సమయంలో గుండె పోటుతో ఒక పెద్దాయన కుప్పకూలారు. దీంతో థియేటర్ యాజమాన్యం స్పందించి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. దీంతో థియేటర్ వద్ద విషాద చాయాలు అలముకున్నాయి. సినిమా చూడటానికి వచ్చి ఇలా జరగడంపై అక్కడి వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా చినిపోయింది రిటైర్డ్ ఏఎస్ఐ అని తెలిసింది.
Read also-Chiranjeevi Comeback: మెగాస్టార్ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న సీనియర్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే?
వివరాల్లోకి వెళితే..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా విజయం సాధించడంతో ఒక వైపు సంబరాలు చేసుకుంటుంటే మరో వైపు ఈ మరణ వార్త విన్న ఆయన కుటుంబ సభ్యలు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడు ఆనంద్ కుమార్ గా పోలీసులు నిర్దారించారు. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మన శంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలోను మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also-YouTube Controversy: ఏయ్ జూడ్‌కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నా అన్వేషణ.. ఎందుకంటే?

