Bhatti Vikramarka: ప్రపంచానికి మహా జాతరను పరిచయం చేస్తాం
Bhatti Vikramarka (imagecrdit:twitter)
Telangana News

Bhatti Vikramarka: ప్రపంచానికి మహా జాతరను పరిచయం చేస్తాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులపై మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సమీక్షించి తదుపరి మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు.

రెండు రోజుల్లో పనులు పూర్తి

ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.260 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఇందులో జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను రూ.110 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు. నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85 శాతం పూర్తి చేశారు, మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశాం, పూర్తి చేసిన పనులకు 24 గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు.

Also Read: Movie Ticket Price: మీకు నచ్చినోళ్ల సినిమాలకు టికెట్ రేటు రూ.600.. పర్మిషన్ ఎలా ఇస్తారు?: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

సుమారు 3 వేల మంది భక్తులు

గతంలో జాతర నిర్వహణకు రూ.75 కోట్లు, రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం రూ.260 కోట్లు చేస్తున్నదని తెలిపారు. ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వారితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఒకేసారి సుమారు 3 వేల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి ఒకేసారి 8 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతర లైవ్‌ కవరేజ్‌కు అనుకూలంగా నాలుగు మీడియా వాచ్‌ టవర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Also Read: Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?

Just In

01

Shaksgam Valley Dispute: భారత్-చైనా మధ్య మరో కొత్త వివాదం.. ‘షాక్స్‌గామ్ వ్యాలీ’ ఎక్కడ ఉంది?, ఇప్పుడెందుకీ వివాదం?

Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?

Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

Germany Good News: భారతీయులకు జర్మనీ గుడ్‌న్యూస్.. ఇకపై వీసా లేకుండానే కీలక సర్వీసు

Prabhas Emotion: ‘ది రాజాసాబ్’లో ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు.. ఏడిపించేశాడు భయ్యా