Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమాకు ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్స్‌లో రివ్యూస్, రేటింగ్స్ ఇవ్వకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతో ఈ మధ్యకాలంలో సినిమాలపై బాగా ఎక్కువైన కుట్రలకు చెక్ పెట్టినట్లయింది. ఈ విషయంపైనే విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బాధపడుతున్నట్లుగ చెప్పడం విశేషం. ఒక సినిమాకు మూవీ టీమ్ పెట్టే హార్డ్ వర్క్, డబ్బు, వారి కలలను ఇలా కోర్టు ఆర్డర్ ద్వారా రక్షించుకోవడం ఆయనకు సంతోషాన్ని కలిగిస్తే, మన వాళ్లే ఇలా మన సినిమాలకు ఇలా పనిగట్టుకుని మరీ చెడ్డ పేరు తీసుకురావాలని చూడటం బాధగా అనిపిస్తోందని ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్‌లో ఏముందంటే..
Also Read- Nari Nari Naduma Murari Trailer: ఒక హీరో, రెండు లవ్ స్టోరీస్.. పరిష్కారం లేని సమస్య!
ఆ ఆలోచనలు ఏమైపోయాయి
‘‘ఇది చూస్తుంటే (కోర్టు ఆదేశాలు) ఒకవైపు సంతోషంగా, మరోవైపు బాధగా ఉంది. ఎంతోమంది కష్టం, పెట్టుబడి, డ్రీమ్‌కు ఇప్పటికైనా కొంతమేరకు రక్షణ లభించినందుకు సంతోషంగా ఉంది. కానీ, మన వాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారనే విషయం తెలిసి చాలా బాధగా అనిపిస్తోంది. ‘బ్రతుకు.. బ్రతికించు’, ‘అందరం కలిసి ఎదుగుదాం’ అనే ఆలోచనలు ఏమైపోయాయి? నేను ‘డియర్ కామ్రేడ్’ మూవీ టైమ్‌లోనే ఇలాంటి కుట్రలను, రాజకీయాలను తెలుసుకుని చాలా బాధపడ్డాను. అప్పటి నుంచి దీనిపై నేను గొంతెత్తి అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకు చెప్పేవారు. కానీ నాతో సినిమా చేసే ప్రతి నిర్మాత, దర్శకుడు ఆ తర్వాత ఈ సమస్య ఎంత తీవ్రంగా గ్రహిస్తూ వస్తున్నారు.
Also Read- PK Martial Arts Journey: టైగర్.. పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు!
మెగాస్టార్ సినిమాతోనైనా సమస్యని గుర్తించారు
అసలు ఈ కుట్రలు చేస్తున్న వారంతా ఎవరు? నా కలలను, నా తర్వాత రాబోయే ఎంతోమంది కలలను కాపాడుకోవడానికి వీరిని ఎలా ఎదుర్కోవాలి? అని ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇప్పుడు ఇండస్ట్రీలోని వారందరికీ ఈ విషయం తెలిసి రావడం, చివరకు మెగాస్టార్ వంటి స్టార్ హీరో సినిమాకు కూడా ఇలాంటి ముప్పు పొంచి ఉందని కోర్టు గుర్తించడం నాకు హ్యాపీగా ఉంది. దీనివల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఒక ముందడుగు మాత్రం పడిందని భావించవచ్చు. ప్రస్తుతం ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో పాటు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ సెలవుల్లో అందరినీ అలరించి, అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండకు నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నిజమే.. ఇది మంచి స్టెప్ అంటూ నెటిజన్లు ఆయన స్పందించిన విధానాన్ని కొనియాడుతున్నారు.
Happy and Sad to see this – Happy to know hardwork, dreams and money of many is protected in a way.
And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?
Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt
— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

