Nari Nari Naduma Murari Trailer: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ఈ సంక్రాంతికి భారీ పోటీ మధ్య తన సినిమాను బరిలోకి దింపుతున్నారు. సంక్రాంతి బరిలో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో థియేటర్లలోకి వచ్చేశారు. ఇప్పుడు మెగాస్టార్ ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’తో జనవరి 12న, మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో జనవరి 13న వస్తుండగా 14న శర్వానంద్ ఇద్దరు భామలతో ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari)తో రాబోతున్నారు. అదే రోజు నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రంతో రానున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల ట్రైలర్ అన్నీ వచ్చేశాయి. కాస్త ఆలస్యమైనప్పటికీ శర్వానంద్ లేటెస్ట్‌గా తన ట్రైలర్‌ను దింపారు. ఆదివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Nari Nari Naduma Murari Trailer)ను మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- PK Martial Arts Journey: టైగర్.. పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు!
ఒక్క హీరో, రెండు లవ్ స్టోరీస్
మరోసారి శర్వానంద్ ‘రన్ రాజా రన్’ తరహా మూవీ చేసినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. శర్వా కూడా అప్పటి శర్వానంద్‌లా కనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ఫన్ రైడ్‌లా అనిపిస్తోంది. గౌతమ్ (శర్వానంద్) అనే ఒక బీటెక్ ఆర్కిటెక్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకవైపు కూల్ గర్ల్ ఫ్రెండ్ (సాక్షి వైద్య)తో సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలోకి, ఫైరీ ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ (సంయుక్త) ఎంటర్ అవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. గతం, వర్తమానాల మధ్య గౌతమ్ పడే పాట్లు, ఆ ముగ్గురి మధ్య జరిగే క్రేజీ సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడం ఖాయమనేది ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఒక్క హీరో, రెండు లవ్ స్టోరీస్ అంటూ గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్రెష్ ఫీల్ వస్తుండటం దర్శకుడి ప్రతిభ అని చెప్పుకోవాలి. రెండు వేర్వేరు టైమ్‌లైన్స్‌లో, రెండు భిన్నమైన లుక్స్‌లో శర్వా కనిపిస్తూ.. తనదైన టైమింగ్, ఎమోషన్స్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సంయుక్త తన పెర్ఫార్మెన్స్‌తో సర్‌ప్రైజ్ చేయగా, సాక్షి వైద్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటోంది. సీనియర్ నటుడు నరేష్ తండ్రి పాత్రలో మరోసారి మెరిశారు. సత్య, సునీల్, సుదర్శన్, సంపత్ రాజ్ వంటివారంతా తమ కామెడీతో హిలేరియస్ మూమెంట్స్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే.
Also Read- Chiranjeevi Balakrishna: చిరంజీవి, బాలయ్య బాబు మధ్య తేడా అదే.. అనిల్ రావిపూడి..
క్లీన్ కామెడీ
టెక్నికల్‌గా కూడా ఈ ట్రైలర్ చాలా రిచ్‌గా ఉంది. దర్శకుడు రామ్ అబ్బరాజు మార్క్ క్లీన్ కామెడీకి తోడు, విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్, జ్ఞానశేఖర్ VS – యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. AK ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కామెడీ మాస్ట్రో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు డబులవుతాయనడంలో సందేహమే లేదు. డబుల్ ఫన్, ట్రిపుల్ మ్యాడ్నెస్‌తో ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల పండగ గ్యారెంటీ అనేలా అయితే ఈ ట్రైలర్ ఉంది. చూద్దాం.. మరి జనవరి 14న ఎలాంటి రిజల్ట్‌ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

