Prabhas RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఓల్డ్ ఏజ్ పాత్రను తీసేశారు. ట్రైలర్ లో కనిపించిన ఆ పాత్ర సినిమాలో లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మారుతి ఆ పాత్ర ఉన్న ఫైట్ సిక్వెన్స్ ను సినిమాలో యాడ్ చేస్తానని ఇప్పటికే చెప్పారు. తాజాగా దీనికి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి. ఈ ఫ్రోమో చూసిన ఫ్యాన్స్ ఇంత మంచి ఫైట్ ను అసలు ఎందుకు తీశారంటూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా.. ఇంతటి ఇంపేక్ట్ ఉన్న సీన్ తియ్యడం వల్లే సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిందంటూ అభిమానుల మారుతీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Chiranjeevi Balakrishna: చిరంజీవి, బాలయ్య బాబు మధ్య తేడా అదే.. అనిల్ రావిపూడి..
విడుదలైన ప్రోమోను చూస్తుంటే.. ప్రభాస్ రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ ముసలి తాత గెటప్‌లో ఉంటూనే, తనదైన స్టైల్‌లో సిగార్ తాగుతూ చేసే యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పాత్రలో ప్రభాస్ మేనరిజమ్స్, నడకలో ఉన్న గాంభీర్యం ‘బాహుబలి’ రేంజ్ ఇంపాక్ట్‌ను ఇస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “ఇంత హై ఇచ్చే సీన్‌ను ఎలా తీసేశారు?” అంటూ మారుతిపై నెటిజన్లు మీమ్స్ పోస్ట్‌లతో విరుచుకుపడుతున్నారు. దర్శకుడు మారుతి ఇప్పటికే స్పందిస్తూ, ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ వీకెండ్ నుంచే ఆ ప్రత్యేకమైన ఫైట్ సీక్వెన్స్‌ను థియేటర్లలో జోడిస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా సినిమాల్లో సీన్లు తొలగిస్తారు కానీ, విడుదలైన తర్వాత మళ్ళీ యాడ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే దీనిని కలపడంతో అభిమానులు మరోసారి ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read also-Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు.. ధర్మాన్ని రక్షించే సినిమా
తాజాగా సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా మూవీ టీం థ్యాక్స్ మీట్ నిర్వహించింది. అందులోని ముసలి తాత పాత్రకు సంబంధించిన సీన్ మొత్తం పడతానని మారుతి తెలిపారు. ఈ మీట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. సినిమా అభిమానులకు నచ్చింది అని నేను అనుకోను, అసలు నచ్చలేదు అని కూడా అనుకోను ఎందుకంటే.. సినిమా డిఫరెంట్ జోనర్ లో తీయడం వల్ల కొంత మందికి అర్థం అయిఉండదు. అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి. అర్థం చేసుకుంటే.. సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక రోజులు ప్రక్షకులకు ఎక్కేది కాదు కొంచెం టైం అడుతోంది. పది రోజుల తర్వాత చూడండి సినిమా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా చాలా నచ్చుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా కొంత మందికి అసలు అర్థం కాలేదని అందుకు చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారని, సినిమా చూసి చాలా మంది నాకు కాల్ చేసి చాలా బాగుందని చెప్పారన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ మొదటి రోజు రూ.112 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.

