Allu Arjun: హీరో, హీరోయిన్లను చూడగానే అభిమానులు ఏ విధంగా ఊగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెర మీద చూసినప్పుడే ఈలలు వేస్తూ, పేపర్ కటింగ్స్ విసిరేస్తూ థియేటర్లలో నానా హంగామా చేస్తుంటారు. అలాంటిది నేరుగా కనిపిస్తే పరిస్థితి ఏ విధంగా కంట్రోల్ తప్పుతుందో రీసెంట్ ఘటనలు కళ్లకు కట్టాయి. మెున్న నిధి అగర్వాల్, నిన్న సమంత, ఇటీవల తమిళ నటుడు విజయ్ విషయంలో అభిమానులు ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చకు తావిచ్చింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సైతం ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ లోని ఓ పాపులర్ కేఫ్ కు భార్యతో కలిసి వెళ్లిన బన్నీతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ హైటెక్ సిటీలోని నిలోఫర్ కేఫ్ (Niloufer cafe)కు అల్లు అర్జున్ (Allu Arjun), తన భార్య స్నేహా రెడ్డి (Sneha Reddy)తో కలిసి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో అభిమానులు ఒక్కసారిగా బన్నీని చుట్టుముట్టారు. సెల్ఫీలు దిగేందుకు అల్లు అర్జున్ వైపునకు దూసుకొచ్చారు. పదుల సంఖ్యలో ఉన్న అభిమానులు చుట్టుముట్టేయడంతో సెక్యూరిటీ సిబ్బంది సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బన్నీ భార్య స్నేహారెడ్డి సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో భార్య చేతిని పట్టుకున్న అల్లు అర్జున్.. సెక్యురిటీ సిబ్బంది సాయంతో అతి కష్టం మీద కేఫ్ నుంచి బయటకు వచ్చారు.
‼️ Did Allu Arjun forget Sandhya Theatre so soon?
A child who lost his mother is still undergoing treatment. Yet, stepping into Niloufer on a packed Sunday evening shows shocking recklessness.
This isn’t fandom. It’s irresponsible stardom.#AlluArjun #AA #Celebrity #TollyWood… pic.twitter.com/nVm49gMK23
— Rathnam News (@RathnamNews) January 5, 2026
కారు వద్ద సైతం..
కారు వద్దకు చేరుకున్న తర్వాత కూడా బన్నీని ఫ్యాన్స్ వదల్లేదు. చేతుల్లో మెుబైల్ ఫోన్ పెట్టుకొని తమ అభిమాన హీరోను కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. కారును అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేశారు. దీంతో వాహనం ముందుకు కదిలేందుకు ఇబ్బంది తలెత్తింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది అతి కష్టం మీద ఫ్యాన్స్ ను పక్కకు జరిపి బన్నీ కారుకు తోవ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూనే బన్నీ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. నిలోఫర్ కేఫ్ లో బన్నీకి ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. శనివారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో నిలోఫర్ కేఫ్ లో రద్దీ ఉండగా.. ఆ సమయంలోనే బన్నీ అక్కడకు రావడంతో అభిమానులు రెచ్చిపోయారు.
Also Read: Indian Woman Murder: అమెరికాలో ఘోరం.. భారత సంతతి యువతి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
హీరో విజయ్‌కి కూడా ఇలాగే..
తమిళ కథానాయకుడు విజయ్ కు సైతం ఇటీవల ఇదే పరిస్థితి ఎదురైంది. మలేషియాలో ‘జన నాయగన్’ సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్ ముగించుకొని డిసెంబర్ 29న విజయ్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. విజయ్ రాక గురించి ముందే తెలుసుకున్న అభిమానులు తమ హీరోకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో ఫ్లైట్ దిగి ఎయిర్ పోర్టులోకి వచ్చిన విజయ్ ను చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పారు. కారు వద్దకు వెళ్తున్న విజయ్ మీదకు దూసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ తాకిడికి విజయ్ కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది విజయ్ ను సురక్షితంగా కారులోకి ఎక్కించి.. అక్కడి నుంచి తరలించారు.
VIDEO | TVK chief Vijay stumbled and fell while trying to get into his car at the Chennai airport.
A large crowd of fans gathered to welcome him as he returned from Malaysia.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/x42Kpd0AsW
— Press Trust of India (@PTI_News) December 28, 2025

